Wednesday, 28 December 2016

What we have lost being Tolerance... Let's be wise in choosing a strong leader who stand supporting Bharath like Maharana and Chatrapati Sivaji and Alluri.... Jai Hind!!!

ఇవి చదివి తెలుసుకొందాం. .
*
కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -
కుశార్, పాకిస్తాన్
*
లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -
లాహోర్, పాకిస్తాన్
*
తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు
నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
*
పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ
కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం
*
మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి
రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
*
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్
*
జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
*
మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
*
శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై
దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
*
దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
*
పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి
విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర
సముద్రతీర ప్రాంతం
*
మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ
ఒరిస్సా
*
నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్
జిల్లా,మధ్యప్రదేశ్
*
వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
*
నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
*
వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన
చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
*
రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
*
సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-
కురుక్షేత్ర దగ్గర
*
హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
*
మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
*
వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
*
కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) -
గ్వాలియర్
*
మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్
ప్రావిన్స్, పాకిస్తాన్
*
ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
*
గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్,
హర్యానా
*
కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
*
పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
*
కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం -
గిర్నార్,గుజరాత్
*
శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
*
హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా,
ఉత్తర్ ప్రదేశ్
*
విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) -
విదర్భ, మహరాష్ట్ర
*
కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
*
చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్,
మధ్యప్రదేశ్
*
కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా,
మధ్యప్రదేశ్
*
ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ,
ఢిల్లీ దగ్గర
*
కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
*
పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్
,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
*
కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) -
కంపిల్, ఉత్తర్
*
జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి,
బీహార్
*
కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన
ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
*
మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి
జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
*
విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్
నగర్,రాజస్థాన్
*
శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
*
ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
*
నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –
ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
*
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
*
కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్
*
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
*
గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్......

Tuesday, 27 December 2016

Punya kshetralu

🕉🕉🕉🕉 🕉🕉 🕉🕉 🕉
హైం ద వ సం స్కృ తి లో 8, 18     అం కె ల కు  గ ల  ప్రా ధా న్య త
🕉🕉🕉🕉🕉 🕉🕉 🕉 🕉

అష్ట లక్ష్మి: ఆది లక్ష్మి, ధాన్యలక్ష్మి , ధైర్యలక్ష్మి , గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి
💜💜💜💜 💜💜 💜💜 💜

అష్టాదశ పీఠాలు:

1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక )
2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్)
4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్)
6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర)
8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ )
10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా)
12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం)
14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్)
15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్)
16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహార్)
17. శ్రీ విశాలాక్షీదేవి ( వారణాశి, ఉత్తరప్రదేశ్)
18. శ్రీ సరస్వతీదేవి ( జమ్మూ కాశ్మీర్)
💙💙💙💙 💙💙 💙💙 💙

అష్టా దశ పురాణాలు:

1. బ్రహ్మపురాణం
2. పద్మపురాణం
3. నారద పురాణం
4. మార్కండేయపురాణం
5. విష్ణుపురాణం
6. శివపురాణం
7. భాగవతపురాణం
8. అగ్నిపురాణం
9. భవిష్యపురాణం
10. బ్రహ్మవైవర్త పురాణం
11. లింగపురాణం
12. వరాహపురాణం
13. స్కందపురాణం
14. వామనపురాణం
15. కుర్మపురాణం
16. మత్స్యపురాణం
17. గరుడపురాణం
18. బ్రహ్మాండపురాణం
❤❤❤❤❤ ❤❤ ❤ ❤

అయ్యప్ప స్వామి గుడి మెట్లు:18

1. పొన్నంబలమేడు
2. గౌదేంమల
3. నాగమల
4. సుందరమల
5. చిత్తంబలమల
6. ఖల్గిమల
7. మాతంగమల
8. మైలదుమల
9. శ్రీపదమల
10. దేవరమల
11. నిలక్కలమల
12. తలప్పరమల
13. నీలిమల
14. కరిమల
15. పుతుసేరిమల
16. కలకేట్టిమల
17. ఇంచిప్పరమల
18. శబరిమల
💚💚💚💚💚 💚💚 💚 💚

అష్టదిక్పాలకులు:

1. తూర్పు (ఇంద్రుడు)
2. ఆగ్నేయం (అగ్ని)
3. దక్షిణం (యముడు)
4. నైరుతి (నిరుతి)
5. పశ్చిమం (వరుణుడు)
6. వాయువ్యం (వాయువు)
7. ఉత్తరం (కుబేరుడు)
8. ఈశాన్యం (ఈశానుడు)
💜💜💜💜 💜💜 💜💜 💜

అష్టమూర్తులు:

1. భూమి
2. ఆకాశం
3. వాయువు
4. జలము
5. అగ్ని
6. సూర్యుడు
7. చంద్రుడు
8. యజ్గ్యము చేసిన పురుషుడు.
💙💙💙 💙💙 💙💙 💙💙

అష్టఐశ్వర్యాలు:

1. ధనము
2. ధాన్యము
3. వాహనాలు
4. బంధువులు
5. మిత్రులు
6. బృత్యులు
7. పుత్రసంతానం
8. దాసిజనపరివారము
💛💛💛 💛💛 💛💛 💛💛

అష్టకష్టాలు:

1. అప్పు
2. యాచన
3. ముసలితనం
4. వ్యభిచారం
5. చోరత్వం
6. దారిద్యం
7. రోగం
8. ఎంగిలి భోజనం
❤❤❤ ❤❤ ❤❤ ❤❤

అష్టఆవరణాలు:

1. విభూది
2. రుద్రాక్ష
3. మంత్రము
4. గురువు
5. లింగము
6. జంగమ మాహేశ్వరుడు
7. తీర్థము
8. ప్రసాదము
💜💜💜 💜💜 💜💜 💜💜

అష్టవిధ వివాహములు:

1. బ్రాహ్మం
2. దైవం
3. ఆర్షం
4. ప్రాజాపత్యం
5. ఆసురం
6. గాంధర్వం
7. రాక్షసం
8. ఫైశాచం
💚💚💚💚💚 💚💚 💚 💚

అష్టభోగాలు:

1. గంధం
2. తాంబూలం
3. పుష్పం
4. భోజనం
5. వస్త్రం
6. సతి
7. స్నానం
8. సంయోగం
💙💙💙💙 💙💙 💙💙 💙

అష్టాంగ యోగములు:

1. యమము
2. నియమము
3. ఆసనము
4. ప్రాణాయామము
5. ప్రత్యాహారము
6. ధారణ
7. ద్యానము
8. సమాధి
☸☸☸ ☸☸ ☸☸ ☸☸
జయతు     హిందూ     సంస్కృతి
జయతు     భారతీయ  సంస్కృతి
🕉🕉🕉 🕉🕉 🕉🕉 🕉🕉🙏

Mana samskaralu....


మన సంస్కారాల అంతరార్థం :

తెలుసుకోండీ... తెలియజేయండీ....

ప్రదోష సమయం

‘ప్రదోష’ అనే పదానికి అర్ధం అధిక దోషం కల సమయం. కానీ నిజానికి ఇది చాలా శుభకరమైన సమయం. ఇంత శుభప్రదమైన కాలాన్ని శబ్దార్ధం ప్రకారం వ్యతిరేకమైన భావాన్ని స్ఫురింపజేసే ‘ప్రదోష’ అనే పదంతో వర్ణించటం వింతగా కనిపిస్తుంది. శబ్దార్ధం ప్రకారం కలియుగ అనే పదానికి పాపంతో నిండిన యుగం అని అర్ధం. కానీ ఈ యుగంలో తప్ప మరియే యితర యుగాల్లోనూ అధిక మోతాదులో పుణ్యం సముపార్జించటానికి అవకాశం లేదు. ప్రదోష కాలంలో ప్రజలు సమావేశమై పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే అ సమయం వారికి శుభప్రదమౌతుంది. అలాగాక వారు ఇతర కార్యక్రమాల్లో ఆ సమయాన్ని గడిపితే దోషాల్ని లేక అనర్ధాల్ని ఇస్తుంది. ప్రదోష సమయంలో చేసిన పాపాల ఫలితాలు మామూలు వేళల్లో చేసిన పాపాల ఫలితాలకంటే నూరు రెట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ కాలంలో ఒనరించిన పుణ్యాల ఫలితాలు కూడా ఇంచుమించు అదే నిష్పత్తిలో ఉంటాయి.

నిజాన్ని గ్రహిస్తే ప్రదోష కాలం చాలా పవిత్రమైనది. శుభప్రదమైనది కూడా. ఈ సమయంలో కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తుంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ సమావేశమవుతారు. కనుక ఈ సమయంలో ఇతర దేవతలా సాన్నిధ్యం కొరకు ఆయా దేవుళ్ళ ఆలయాలకు పోనక్కరలేదు. ఆ కాలంలో అందరు దేవతలు శివుని దగ్గరే ప్రత్యక్షమౌతారు. కాన ఆకాలంలో శివుని ఆరాధిస్తే మనకు శివుని ఆశీస్సులతోబాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ప్రదోషకాలం యొక్క విశేష లక్షణమిదే.

ఈ సమయంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా మనకు దర్శనమిచ్చుట ద్వారా ఒకే శరీరంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తాడు. ఆయన ఎడమవైపు పార్వతి రెండవ పార్శ్వమున శివుడు ఉంటారు. ఈ సమయంలో మనంఅర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే మనకు రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కోర్కెలను నియంత్రించగల్గటం ఒకటి. కాలాన్ని అనగా మరణాన్ని జయించగల్గటం రెండవది. శివునకు కాల సంహారమూర్తియని, కామ సంహారమూర్తియని పేర్లున్నవి. శివునకు చాలా ఇతర నామాలున్నాయి. కంచిలో ఒక మామిడి వృక్షం క్రింద ఉంటాడు గనుక అక్కడ ఆయన్ని ఏకామ్రేశ్వరుడ౦టారు. మద్రాసులోని మైలాపూరులో ఆయన్ని కపాలేశ్వరుడని పిలుస్తారు. అక్కడ ఉన్న ఈశ్వరుడు చేతిలో కపాలాన్ని ధరించి ఉంటాడు. మన్మథుణ్ణి సంహరించాడు. గనుక ఆయనకు కామ సంహారమూర్తి అని పేరు కూడా ఉంది.

ప్రదోషకాలంలో ఉపామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేస్తుంది ఈ క్రింది శ్లోకం.

“శ్లో!! సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే
భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్
వామాంచి మాత్ర కలితే జనని త్వదీయే
కావా ప్రసక్తిరిహ కాలజయే పురారే!!

అర్థనారీశ్వర రూపంలో మూడవ నేత్రం మీ దంపతులకిరువురకు చెందినదే. కానీ కామ సంహార మూర్తి లేక కామారి అనే బిరుదు శివునకు మాత్రమె చెందుతుంది. నీకాఖ్యాతిని, గౌరవాన్ని తీసుకునే అవకాశం ఈయబడలేదు. మీరిరువురకు ఉమ్మడియైన ఒక వస్తువువల్ల ఒక కార్యం సాధించబడితే, దానివల్ల లబ్ధమయ్యే కీర్తి గాని, పేరు గాని యిరువురికి చెందవలయుగదా, కానీ యిక్కడ పరమేశ్వరునకు మాత్రమె ఈయబడినది. అది అలా ఉండగా, కాలసంహారమూర్తి యనే పేరుకూడా ఆయనకే దక్కాలా? కాలుణ్ణి అనగా యముణ్ణి తన వామపాదంతో తంతాడు. వామపాదం నీకు సంబంధించినది. అయినా ఈ కీర్తి కూడా నీకు దక్కకుండా ఆయనకే సంక్రమిస్తుంటే, ఓ పార్వతీ ఎలా మిన్నకున్నావు?”

ఈ చమత్కార రచన ద్వారా పార్వతీ పరమేశ్వరుల మధ్య స్పర్థ సృష్టించటం కవియొక్క ఉద్దేశ్యం కాదు. ఆవిధంగా భక్తుల దృష్టిని అర్థనారీశ్వరుని వైపు త్రిప్పి ప్రదోష కాలంలో ఆ రూపాన్ని నిత్యం క్రమంగా వారిచే ధ్యానింప చేయటమే కవి స౦కల్పం. భగవంతుని ఈరూపంలో స్మరించిన ప్రతివాడూ కోరికలను జయించి పూర్వం కంటే సుఖతరమైన జీవితాన్ని గడపగల్గుతాడు.

ఉదయం వేళలో మనం శ్రీహరి శ్రీహరి అంటూ విష్ణువునే స్మరించాలి. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువు గనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. సూర్యాస్తమయ సమయంలో శివుని స్మరించాలి. అలాచేస్తే మన నిత్యజీవితంలో సమతుల్యత లభిస్తుంది. హర శబ్దానికి హరించువాడని అర్ధం ఆయన్ని సాయం సమయాల్లో ధ్యానిస్తే మన పాపాల్ని అన్నింటినీ హరింపచేస్తాడు. “ప్రదోషే హరిం న పశ్యాత్ నృసింహం రాఘవం వినా” విష్ణువు నృసింహావతారం ఎత్తింది సాయం సంధ్యా సమయంలోనే గనుక నృసి౦హునకు మినహాయింపు ఈయబడింది. ఇక రాముని విషయానికొస్తే ‘రమయతీతి రామః” -ప్రజలను రంజింప చేసే వాడు కనుక రాముని ఎల్లవేళలా స్మరించవలసిందే.

పక్షానికి ఒకసారి సంభవించే మహాప్రదోష కాలంలో శివదర్శనం, శివనామ జపంమనకు అమిత ప్రయోజనకరం. సాయంసంధ్యసమయంలో ఉన్న త్రయోదశి తిధినాటి ప్రదోష కాలమే మహాప్రదోషమవుతుంది. ఆనాడు ఉదయం ద్వాదశి తిధి ఉన్నా ఇబ్బంది లేదు. కనుక ప్రదోషకాలం అన్ని విధాలా శుభప్రదమైంది, పవిత్రమైనది అని ఎంచి అర్ధనారీశ్వరుని ధ్యానించి మనం తరించాలి.🌹🌹🌹🌹

తెలుసుకోండీ... తెలియజేయండీ....

నవగ్రహ దోషములకు చేయవలసిన స్నానములు....!!

మానవ జీవితమున నవగ్రహాల ప్రభావంతో ఈతిబాధలు తప్పవు. నవగ్రహాలలో ఒక్కో గ్రహం, దాని తాలూక దోషం.. ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించడానికి పలు రకాల అవస్థలు పడుతుంటారు. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను గురించి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.
స్నానౌషధములు సిద్ధౌషధ సేవల వల్ల వ్యాధులు, మంత్ర జపము వల్ల సకల భయం తీరునట్లుగా ఔషధస్నాన విధానం వల్ల గ్రహదోషములు నశించును.
🌅 సూర్య గ్రహ దోష నివారణకు...కుంకుమ పువ్వు, మణిశిల, ఏలుకలు, దేవదారు, వట్టివేళ్ళు, యష్టిమధుకము, ఎర్ర పుష్పాలు, ఎర్రగన్నేరు పువ్వులు.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఈ నీటితో స్నానం చేయాలి. సూర్య గ్రహ దోష నివారణకు గాను సూర్యున్ని పూజించుట, ఆదిత్య హృదయం పారయణ చేయుటకు, కెంపు,(మాణిక్యము) ధరించుట, సూర్యునకు గోధుములు, బెల్లం, కంచు, గుర్రము, రక్త చందనం, పద్మములు, ఆదివారం, దానం చేస్తే.. రవి వలన కలిగిన దోషాలు తొలుగును.
కంచుతో చేయబడిన ఉంగరం ధరించుట వల్ల మంజిష్టం గజమదం, కుంకుమ పువ్వు రక్త చందనములను రాగి పాత్రయందలి నీటిలో కలిపి ఆ రాగి పాత్ర యందలి నీటితో స్నానము చేసిన దోష నివృత్తి కలుగుతుంది. రాగి ఉంగరము ధరించడం కూడా మంచిదే. శుభ తిధి గల ఆదివారము రోజున సూర్యుని ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః సూర్యాయనమహః అను మూలమంత్రమును 40 రోజులలో 6 వేలు జపము పూర్తి చేసిన సూర్య సంబంధమైన దోషాలు తొలగిపోతాయి.
🕉 చంద్ర గ్రహ దోష నివారణకు...గో మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు నెయ్యి, శంఖములు, మంచి గంధములు, స్పటికము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. చంద్రగ్రహ దోష నివారణకు చంద్రుని పూజించుట, దుర్గా దేవి ఉపాసించుట, బియ్యం దానం చేయుట, ముత్యం ఉంగరాన్ని ధరించుట గాని, మాలగా వేసుకొనుట గాని చేయాలి. సీసం, తెల్లని ఆవు, ముత్యములు, తెల్లని వస్త్రం నేయితో నింపిన కలశం, ఎద్దులలో ఎదేని ఒకటి సోమవారం దానము చేసినచో చంద్రునకు సంబంధించిన దోషం పోవును. వట్టివేర్లు, దిరిసెన గంధం, కుంకుమ పువ్వు, రక్త చందనము కలిపి శంఖములోపోసిన నీటితో స్నానం ఆచరిస్తే చంద్ర దోష పరిహారం కలుగుతుంది.
సీసపు ఉంగరము, వెండి ఉంగరము గాని ధరించుట మంచిది. శుభ తిధి గల సోమవారము నందు ఓం-శ్రాం-శ్రీం-శ్రౌం-సః చంద్రయనమః అను మంత్రమును 40 జపము చేసి చివరి రోజున అంటే.. 41వ రోజున బియ్యం, తెల్లని వస్త్రం నందు పోసి దానం చేస్తే చంద్ర దోష నివారణ కలుగుతుంది.
🕉 కుజ గ్రహ దోష నివారణకు...మారేడు పట్టూ, ఎర్ర చందనము, ఎర్ర పువ్వులు, ఇంగిలీకము, మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం ఆచరించాలి. కుజ దోష నివారణకు గాను కుజుని పూజించి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్లగానీ, ఎర్రని పగడమును గాని కందులు, మేకలు, బెల్లము, బంగారము, ఎర్రని వస్త్రము, రాగి వీటి యందేదయిన దానము చేయుటకు కాని కుజదోష నివారణ అవుతుంది. వెండి పాత్రయందు చండ్రకర్ర గంధము, దేవదారుగంధం ఉసిరిక పప్పు కలిపిన నీటితో స్నానం ఆచరిస్తే అంగారకదోష నివారణ కలుగుతుంది.
బంగారు ఉంగరము ధరించు ఆచారము కలదు. శుభ తిధి గల మంగళవారం రోజున ఓం-క్రాం-క్రీం-క్రౌం-సః భౌమాయనమః అను మంత్రమును 7 వేలు 40 రోజులలో పూర్తి చేసిన ఎర్రనిరంగు బుట్టలో కందులు వేసి 41 వ రోజున దానం చేయడం మంచిది.
🕉 బుధ గ్రహ దోష నివారణకు...చిన్న సైజులో ఉండే పండ్లు, ఆవు పేడ, గోరోచనము, తేనే, ముత్యములు బంగారము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించవలెను. బుధ గ్రహ దోష నివారణకుగాను బుధ గ్రహమునకు పూజ,విష్ణు సహస్రనామ పారయణ చేయాలి. పెసలు దానము చేయాలి. ఆకు పచ్చ రంగు బట్ట, తగరము, టంకము, పచ్చ పెసలు, మరకతము, లొట్టపిట్ట, గజదండము (అంకుశము), పచ్చని పూవులు... వంటి వానిలో ఒకటి దానం చేసినచో బుధగ్రహం వలన కలుగు దోషం పరిహరించబడును.
నదీసంగమము నందు గల సముద్రపు నీటిని మట్టిపాత్రలో పోసి ఆ నీటిలో గజమదము కలిపి, ఆ నీటిని స్నానం చేస్తే కూడా బుధ దోషం తొలగును. ఇత్తడి లేక కంచు ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభ తిధితో కూడిన బుధవారమునందు ఓం-బ్రాం-బ్రీం-బ్రౌం-సః బుధాయనమః అను మంత్రమును 40 రోజులలో జరిపించి చివరి రోజున అనగా 41 ఆకు పచ్చని వస్త్రములలో పెసలు పోసి దానము చేసినచో బుధగ్రహ దోష నివారన కలుగును.
🕉 గురు గ్రహ దోష నివారణకు...మాలతీ పువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనే... వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. గురు దోష నివారణకు గురుగ్రహమును పూజించుట నమక పారాయణ చేయడం వల్ల దోష నివారణయగును. పుష్యరాగం ఉంగరమున ధరించుట శనగలు, పుష్యరాగం, పసుపు, చక్కెర, ఏనుగు, బంగారు రంగువస్త్రము గాని, బంగారము గాని ఎదొకదానిని దానము చేయుటవలన కూడా గురునకు సంబంధించిన దోషము శాంతించగలదు. బంగారుతో చేసిన పాత్రతో బ్రహ్మమేడి (బొడ్డ), మారేడు, మర్రి, ఉసిరిక ఫలములను వేసి ఆ నీటితో స్నానం చేస్తే.. గురువునకు సంబంధించిన దోషము తొలగిపోవును.
బంగారముతో చేసిన ఉంగరము సాంప్రదాయము. శుభతిధి గల గురువారము నాడు ఉదయము ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః బృహస్పతయే నమః అను మంత్రము 40రోజులలో 16వేలు జపము పూర్తి చేసి పసుపు పచ్చని బట్టలో సెనగలు దానమిచ్చినచో గురుగ్రహ దోష శాంతి కలుగును.
🕉 శుక్ర గ్రహదోష నివారణకు...కుంకుమ పువ్వు, యాలుకలు, మణిశిల, శౌవర్చ లవణము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించాలి. శుక్ర గ్రహ గ్రహ నివారణకు గాను శుక్ర గ్రహమునకు లక్ష్మీదేవికి పూజ చేయాలి. వజ్రమును ఉంగరంను ధరించుట వలన శుభ వస్త్రము, తెల్లని గుర్రము తెల్లని ఆవు, వజ్రం, వెండి, గంధము, బియ్యం బొబ్బర్లు వీటియందేదొకటి దాన మిచ్చుట వలన గాని శుక్ర గ్రహ దోషం నివారింపబడును. వెండి పాత్రయందలి నీటిలో గోరోచనము గజమదము, శక్తిపుష్పము, శతావరిని కలిపి, ఆ నీటితో స్నానం ఆచరిస్తే శుక్రగ్రహ సంబంధమైన దోషం తొలగును.
వెండితో చేసిన ఉంగరము గాని, ముత్యముతో వెండి ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభతిధితో కూడిన శుక్రవారమునందు ఓం-ద్రాం-ద్రీం-ద్రౌం-సః శుక్రాయనమః అను మంత్రము 20,వేలు 40రోజులలో జపము పూర్తిచేసి ,41వ రోజున తెల్లని వస్త్రములో బొబ్బరులుపోసి దానము చేసిన శుక్ర సంబంధమైన దోషం నివారింపబడును.
🕉 శని గ్రహ దోష నివారణకు..:సాంబ్రాణి, నల్ల నువ్వులు, సుర్మరాయి, సోపు.. వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి. శని గ్రహ దోష నివారణకు శనిగ్రహ పూజలు,ఈశ్వర పూజ, తైలాభిషేకం, నీలమణి ధరించుట, నువ్వులు దానం చేయడం వల్ల గ్రహ దోష నివారణ కలుగును. నీలం, నూనె, నువ్వులు, గేదె, ఇనుము, నల్లని ఆవులందు ఏదో ఒకటి దానం చేయవలెను. ఇనుప పాత్రయందు గల నీటిలో మినుములు, ప్రియంగు ధాన్యము, నీలగంధ, నీల పుష్పములు వేసి ఆ నీటితో స్నానము చేస్తే శనిగ్రహ దోష నివారణయగును.
శుభతిధి గల శనివారము నుండి ఓం-ఖ్రాం-ఖ్రీం-ఖ్రౌం-సః శనయేనమః అను మంత్రము 40 రోజులలో 19వేలు జపము చేసి, 41వ రోజున నువ్వులు నల్లని బట్టలో వేసి శని గ్రహ దోష నివారణ కలుగుతుంది.
🕉 రాహు గ్రహ దోష నివారణకు...నువ్వు చెట్టు ఆకులు, సాంబ్రాణి, కస్తూరి, ఏనుగు దంతము (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి).. ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం ఆచరించాలి.  రాహు గ్రహ దోష నివారణకుగాను రాహు గ్రహమును పూజించుట, దుర్గాదేవిని పూజించుట, గోమేధికమును ధరించుట వలన రాహు గ్రహ దోష నివారణ యగును, గోమేధ్కము, గుర్రము, నీలవస్త్రము, కంబళి నూనె, మినుములు, పంచలోహములు, వీటియందేదైన దానం చేయడం వల్ల కూడా దోష శాంతి కలుగును.
గేదె కొమ్ముతో చేసిన పాత్రయందలి ఉదకమున గుగ్గిలము, ఇంగువ,హరిదళము, మనశ్శిలలతో కలిపి ఆ నీటితో స్నానం చేసి అన్చో రాహు దోషం తొలగును. పంచ లోహములతో చేసిన ఉంగరము ధరించుట సాంప్రదాయం. శుభతిధి గల శనివారము నాడు రాహుమంత్రమగు ఓం-భ్రాం-భ్రీం-భ్రౌం-సః రాహవే నమః అను మంత్రమును 40 రోజులలో 18 వేలు జపము పూర్తి చేసి, 41వ రోజున మినుము చల్లని బట్టలో వేసి దానం చేసినచో రాహుగ్రహ సంబంధమైన దోషం తొలగిపోవును.
🕉 కేతు గ్రహ దోష నివారణకు...సాంబ్రాణి, నువ్వుచెట్టు ఆకులు, మేజ మూత్రం, మారేడు పట్ట, ఏనుగు దంతం, (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి)..  ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను. కేతు దోష నివారణకుగాను కేతుగ్రహమును పూజించి సూర్యనమస్కారములు చేస్తూ ఉలవలు దానం ఇవ్వాలి. వైఢూర్యం, నూనె, శాలువా, కస్తూరి, ఉలవలు వీటిని దానం చేసినా కూడా కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది.
ఖడ్గమృగము కొమ్ముతో చేయబడిన పాత్రయందు గల నీటిలో పర్వతముల యందు పందికొమ్మతో తవ్వబడిన మట్టి, మేక పాలు కలిపి ఆ నీటితో స్నానం ఆచరిస్తే కేతుగ్రహ దోష నివారణ కలుగును. పంచలోహముల ఉంగరం ధరించుట సాంప్రదాయం. శుభ తిధి గల మంగళవారం నాటి నుంచి ఓం-ప్రాం-ప్రీం-ప్రౌం-సః కేతవే నమః అను మంత్రమును 40 రోజులలో 7 వేలు జపము పూర్తి చేసి 41వ రోజున ఎర్రని వస్త్రంలో ఉలవలు పోసి దానమిచ్చిననూ కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది....✍
� లోకాస్సమస్తాస్సుఖినోభవంతు .🌹🌹🌹🌹

The Birth of Holy Cow -గోమాత_జననం స్కాంద పురాణము!!!

గోమాత_జననం

ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు. అధర్వణ వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది. ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు.

సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి.

లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాలనుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు
.‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’

ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు.
వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి.
- గోమాత_జననం

ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు. అధర్వణ వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది. ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు.

సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి.

లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాలనుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు
.‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’

ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు.
వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి.
- స్కాంద పురాణము.

గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.

‘‘ధేనునా మస్మి కామధుక్’’ అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.

సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు.

 త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు.

ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే!
స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.

గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.

ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది.

‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది.

గోమాత - కీర్తనం శ్రవణం దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే..🌹🌹🌹🌹

గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.

‘‘ధేనునా మస్మి కామధుక్’’ అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.

సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు.

 త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు.

ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే!
స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.

గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.

ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది.

‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది.

గోమాత - కీర్తనం శ్రవణం దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే..🌹🌹🌹🌹

Wednesday, 21 December 2016

Five Vedas

❗ *Free E Library* ❗

यह ई पुस्तकालय है, जिसमें दर्जनों अमूल्य ग्रंथों के PDF सहेजे गए हैं, ताकि यह अधिक से अधिक लोगों के काम आ सकें, धर्म और राष्ट्र संबंधी विषय पर PDF में अमूल्य पुस्तकें इन लिंक में संग्रहित हैं, आप विषय देखकर लिंक खोलें तो बहुत सी पुस्तकें मिलेंगी, सभी पुस्तकें आप निशुल्क download कर सकते हैं, इन लिंक्स में सैकड़ों किताबें हैं, जो कई पीढ़ियों की मेहनत का फल हैं, इस हिंद महासागर से मोती चुन लें...

Swami Dayananda - स्वामी दयानंद :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRZnUxOEpPSVBHVzQ/edit

Aadi Shankaracharya - आद्य शंकराचार्य :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRallkZ0VIWnRPVjA

Sri Aurobindo - श्री अरविंदो :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRSWktaVFPa2tSa2s

Swami Vivekanand - स्वामी विवेकानन्द :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRMFAtTi1yUFAzdW8

Swami Ramteerth - स्वामी रामतीर्थ :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRNGlYZzhqTEQtcU0

Sitaram Goel - सीताराम गोयल :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRT19aT3pnZ0tvODA

Veer Savarkar - वीर सावरकर :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRbE0wQng5YVZmb1E

Swami Shivanand - स्वामी शिवानंद :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRYXJDclQwYTBfWFk

हिन्दू, व हिन्दु राष्ट्र :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRNW1scHdGMHQzZ0U/edit

Basic Hinduism :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRTXdpN29OTUQ0Q3c

Hindutva and India :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRNzh0MXhyRVpiVEE

Islam Postmortem -इस्लाम की जांच पड़ताल :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRdjB2R1VNTTk2Q3M

Christianity Postmortem - बाइबिल पर पैनी दृष्टि :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRcHJfRnFkRGFQcFk

Autobiography - आत्मकथाएं :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRbEpPUGcydTZlWDQ

धर्म एवं आध्यात्म :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRRzViUEdGMnI2Smc/edit

यज्ञ - Yajna :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRUThPYWlldEd6NVE/edit

Brahmcharya - ब्रह्मचर्य :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRNzJmbWpSYmg5bjQ

Yog - योग :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRcWZ1NzBoWER2Tkk

Upanishad - उपनिषद :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRNDJiQVFDbVFjbGc/edit

Geeta - श्रीमद्भगवद्गीता :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRWk9KVno2V3NNLXM

Manu and pure Manusmriti - महर्षि मनु व शुद्ध मनुस्मृति :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRTXlYQUJhUXNWM00

Valmeeki and Kamba Ramayan - वाल्मीकि व कम्ब रामायण :
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRa18yTE5EM1Z3Zk0

Books on Vedas - वेदों पर किताबें :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRSU9OVzBfbENTcDg/edit

Maharshi Dayananda - महर्षि दयानंद समग्र :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRN2RzYVdFZWI1a0U/edit

Complete commentaries on Veda - सम्पूर्ण वेद भाष्य :
Introduction to the Commentary on the 4 Vedas - ऋग्वेदादिभाष्यभूमिका :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRejNEaUo1RERJdFE/edit

RigVeda - ऋग्वेद सम्पूर्ण :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfROXl0b3B0RFpkWEE/edit

YajurVeda - यजुर्वेद सम्पूर्ण :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRby02cXFWbnQ2b2M/edit

SamaVeda - सामवेद सम्पूर्ण :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRNnh4ZG5PdUJ2bkU/edit

AtharvaVeda - अथर्ववेद सम्पूर्ण :
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRMFFXcU9waVl4aDQ/edit