Saturday, 30 December 2017

Who Translated Bhagavadgeeta to various languages....?

భగవత్గీత ని వివిధ భాషల్లో కి అనువాదం చేసినది ఎవరు??

పోస్ట్ చివరి దాకా చదవండి మీకోక షాక్ తగులుతుంది

భగవత్గీత ని ఉర్దూ లోకి అనువదించిన వ్యక్తి
మొహమ్మద్ మెహరుల్లా (హిందూ ధర్మం స్వీకరించారు)

అరబిక్ లోకి అనువదించిన వ్యక్తి ఈ.ఎల్.ప్యాచ్ కమండో(ఇస్కాన్ లో చేరిపోయారు)

ఇంగ్లీష్ లోకి అనువదించిన వ్యక్తి
చార్లెస్ విల్కినోస్
"సనాతన ధర్మం ఒక్కటే ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వగలదు" అని అన్నారు

బ్రెజిల్ లోకి అనువాదం  చేసిన వ్యక్తి
బ్రాకెట్స్ లోవి వాళ్ళ ఒరిజినల్ పేర్లు హృదయనంద గోస్వామి( హోవార్డ్ జె. రేనిస్క్) అలానే నలుగురు భక్తులతో కలిసి చేసాడు
మహాకాళ దాస( లిమా మరికొ పొమ్బో)
లోకసాక్షి దాస (లుకో వలేర)
ఆరాధ్య దాస(కార్లోస్ ఫెర్నాండెస్ అమరో)
ఈశ్వర దాస(ఎనియస్ గువెర్రియో)

రష్యన్ లోకి అనువదించిన వ్యక్తి నోవికోవ్(కృష్ణ భక్తుడు ఐపోయాడు)

ఇప్పుడు ప్రపంచంలో వేరు వేరు భాషల్లోకి చేసిన వారి పేర్లు తెలుసుకుందాం

హీబ్రు లోకి అనువాదం చేసినవారు (ఈయన ఇశ్రాయేలీయుడు) బేజాషుటోన్ లీ ఫనా

జర్మన్ లోకి అనువాదించిన వ్యక్తి
ఫిడెరిక్ మేయర్

పర్షియన్ లోకి అనువదించిన వ్యక్తి
 దారా షికోహ్

చైనీస్ లోకి అనువాదం చేసిన వారు
జెన్ కెము,జోవ గువోహ్వ ఇద్దరితో జి బిజూహాంగ్
అలానే హువాంగ్ బావోషేంగ్ తో మరో నలుగురు
గువో లియాంగన్,లీ నాన్,జి వెయిజన్,డ్యూయన్ కీన్గ్ ఒక కమిటీ లాగా ఏర్పడి అనువాదం చేశారు

స్పానిష్ లోకి అనువాదం చేసిన వారు హార్మోన్డ్స్ వర్త్, రైడర్&కో

జనపనీస్ లోకి అనువాదం చేసిన వ్యక్తి
సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ఒక జపనీస్ మహిళ ని వివాహం చేసుకుని ఆ భాష లోకి అనువాదం చేశారు

లాటిన్ లోకి అనువాదం చేసిన వ్యక్తి
ఆగస్టు విల్హేమ్

ఫ్రెంచ్ లోకి అనువాదం చేసినది
పర్రాడ్

గ్రీకు లోకి అనువాదం చేసినది
జార్జ్ కె. టైపాల్ దాస్

ఇప్పటి వరకు మన భగవత్గీత ని 230 భాషల్లో మేధావులు అనువదించారు వాళ్ళల్లో

58 బెంగాలీ
44 ఇంగ్లీష్
12 జెర్మన్
4 రష్యన్
4 ఫ్రెంచ్
13 స్పానిష్
5 అరబిక్
3 ఉర్దూ అలానే మరెన్నో భాషల లోకి అనువాదాలు ఉన్నాయి

చివరి ట్విస్ట్

ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఖురాన్ ని
బెంగాలీ లోకి అనువదించినది గిరీష్ చంద్రసేన్....కానీ ఆయన ముస్లిం అవ్వలేదు హిందూ గానే కొనసాగుతున్నారు 😜😝

Friday, 10 March 2017

Why India is called as Bharat from Ancient Days...

1. మనదేశానికి #భరతదేశమని పేరురావటానికి కారణమైన భరతుని పెంచి పెద్దచేసినది - #శకుంతల
(దుష్యంతుడు కారణాంతరాలవల్ల భరతుణ్ణి తన కొడుకే కాదన్నాడు)
2. ఆరు సంవత్సరాల బాలుణ్ణి ప్రోత్సహించి, విష్ణు దర్శనం చేయించి ధృవమండలంలో శాశ్వితంగా వెలుగొందే స్థానానికి చేర్చినది - తల్లి #సునీతి....
3. ఇంద్రుణ్ణి ఓడించి అమృత భాండాన్ని భువికి తెచ్చేంత వీరునిగా గరుత్మంతుణ్ణి పెంచినది - తల్లి #వినతాదేవి....
4. ప్రహ్లాదుణ్ణి అనన్య విష్ణు భక్తునిగా చేసినది - తల్లి #లీలావతి....
5. హనుమంతుణ్ణి పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో అనన్య సామాన్యునిగా చేసినది - #అంజనాదేవి
6. లవ-కుశులను పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో తండ్రికి తగ్గవారిగా చేసినది - #శీతాదేవి....
7. భీష్ముడిని పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో అనన్య సామాన్యునిగా చేసినది - #గంగాదేవి....
8. పాండవులను  పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో అనన్య సామాన్యులుగా చేసినది - #కుంతీదేవి....
9. శాతకర్ణిని  పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో అనన్య సామాన్యునిగా చేసినది - #గౌతమీదేవి....
10. శివాజీ మహరాజ్ ను  పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో అనన్య సామాన్యునిగా చేసినది - #జిజియాభాయి....
11. #గాంధీ,,
12.#అబ్దుల్_కలాం గారు,,
13.మన ప్రియతమ #ప్రధాని_మోడీ గారు మొ!! వారి జీవితాలలో తల్లుల పాత్రలను ప్రత్యక్షంగా చూస్తున్నాం....

ఈ భూమిపై మనిషిగా మనం చేయగలిగిన అత్యుత్తమమైన విధులలో పిల్లలను ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దడం అతి ముఖ్యమైనది....
ఈ పని తల్లులు సమర్ధవంతంగా చేయగలరు....
నేటి సామాజిక పరిస్తితులలో అది కొరవడడం వల్లనే అన్ని సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి....

Lord Surya Bhagavan Temple. మార్తాండ సూర్య దేవాలయం.....!!

మార్తాండ సూర్య దేవాలయం.....!!

కాశ్మీర్ లో ఒకప్పుడు అత్యంత సుందరం గా శోభిల్లిన మార్తాండ సూర్య దేవాలయం
ఆ ఆలయం యొక్క విశిష్టతను ఒక్కసారి చదవండి.
ఇక్కడున్న ఫోటోలు :
( 1 ) మార్తాండ ఆలయం కూలగొట్టబడక ముందు ఎలా ఉండేది అన్న ఊహా చిత్రం .

( 2 )1868 లో జాన్ బుర్కే అనే బ్రిటీషర్ తీసిన ఫోటో

( 3 ) ప్రస్తుతం మార్తాండ సూర్య దేవాలయం యొక్క ఫోటో
కాశ్మీర్ లోని మార్తాండ సూర్య దేవాలయాన్ని రాజా బుల్నాట్ అనే రాజు నిర్మించారు.

ఆకాలంలో ఆలయం ఎంతో శోభాయమానంగా విరాజిల్లింది.
ఆ విధంగా ఎంతో ప్రశస్తి చెందిన ఆ ఆలయాన్ని సికిందర్ అనే రాజు తన సైనికుల చేత ధ్వంసం చేయించాడు. దాదాపుగా 13 నెలల పాటు సైనికులంతా కలిసి ఎంతో కష్టపడితే, డెబ్బై శాతం ఆలయాన్ని మాత్రమే కూలగొట్టగలిగారు.
అంటే.......ఆ ఆలయాన్ని ఎంత పటిష్టంగా నిర్మించారో మనకు అర్థమవుతోంది. చివరికి.... ఎలాగైనా ఆలయాన్ని పూర్తి నాశనం చేయాలని , మిగిలిన భాగానికి భారీగా నిప్పు పెట్టారు.
అలా......ఆలయాన్ని ధ్వంసం చేసే క్రమంలో
అక్కడి సైనికులకు భూగర్భంలో ఒక రాగి ఫలకం దొరికింది.
ఆ రాగి ఫలకంలో “ రాజా బుల్నట్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ జీవిత కాలం రాజు తెలుసుకోగోరి , ఆస్థాన జ్యోతిష్కులను అడుగగా.........వారు ఈ ఆలయం నిర్మించిన 1100 సంవత్సరాల తర్వాత సికిందర్ అనే పేరు గల రాజు చేతిలో ఇది ధ్వంసం అవుతుంది “ అని రాసి ఉంది.
దీనిని చదివించుకున్న సికిందర్ ఈ ఆలయం ధ్వంసం విషయాన్ని అంత కచ్చితంగా చెప్పిన అప్పటి జ్యోతిష్యుల పరిజ్ఞానానికి , నైపుణ్యానికి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఈ రాగి ఫలకం విషయం తనకు ముందే తెలిసి ఉంటే , ఈ ఒక్క ఆలయాన్ని కూలగొట్టకుండా ఉండి , భారతీయుల యొక్క ఈ శాస్త్రం తప్పని నిరూపించే వాడిని అని సికిందర్ తన సైనికులతో వాపోయాడని చరిత్ర కారులు అంటారు.

🙏🙏😭😭😭🙏🙏

Karma Sidhantam కర్మ సిధ్ధాంతం

కర్మ సిధ్ధాంతం

గురుత్వాకర్షణ సిధ్ధాంతం అనేది ఎక్కడో ఒక ఆపిల్ పండు పడితేనే గానీ లేదా ఎవడో చెప్తేనే గానీ మనకు తెలియలేదు అనే అజ్ఞానపు మూర్ఖత్వం లాగానే
కర్మ సిధ్ధాంతం అనేది నేను నమ్ముతాను నేను నమ్మను నేను నమ్మనిది అసలు ఉండదు ఉండలేదు ఉండబోదు అని ఆలోచించే అజ్ఞాన మూర్ఖత్వానికి పరాకాష్ట

కనబడని ప్రాణవాయువు ద్వారా నీ గుండె గమనం అన్నది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో ప్రాణం పోయాక ఏ ప్రాణ వాయువూ నీ గుండెని ఎలాగ కొట్టుకునేలా చేయలేదో అన్న విషయం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో కర్మ సిధ్ధాంతం పై జరిగే R&D మనము నేర్చుకునే పాటించే ఈ కర్మాచరణ, కర్మ ఫల ప్రాప్తి, నిష్కామకర్మ, కర్మ నివృత్తి, కర్మ శేషమ్, క్రియా యోగం వంటివి అంతే నిజం.

జన్మకి కారణం కర్మ.
జన్మ మరణ చట్రానికి (Loop) కారణం కర్మ.
సుఖదుఖ కర్మాచరణలకు, జీవి యొక్క కర్మఫల భోగభాగ్యాలకు కారణం కర్మ.
కర్మ నిశ్శేషమే మోక్షం.

కర్మ లేదా కర్మ సిధ్ధాంతం అన్నవి అర్ధం చేసుకోవడం ఎంత సులభమో అంతే COMPLEX.
ఈ కర్మ జనితమైన జనన మరణ మాయా నిర్మితమైన పరమాత్మ సృష్టిని దాటడం కూడా ఎంత సులభమో అంతే COMPLEX.
కొన్ని కోట్ల జన్మల సంచిత కర్మ రాశి ఎంత ఉందో ఇంకా ఎన్ని కోట్ల జన్మల ఫలానుభవం మిగిలి ఉందో అర్ధం కావాలంటే ఈ చిన్న Trial చేసిన తెలుస్తుంది.

కళ్ళు మూసుకుని ఆలోచనా రహితంగా ఎలాగ ఉండలేమో ఆయా ఆలోచనలు మన కర్మరాశికి positive మరియూ negative balance add చేస్తూ జీవి అనుభవించాల్సిన కర్మరాశిని పెంచుతూ ఉన్నాయి. అలాంటిది ఇక మన మూర్ఖత్వంతో ప్రతీ రోజూ ప్రతీ క్షణం చేస్తూన్న కర్మ క్రియలను ఎలాగ గణిoచగలము.

భక్తి యోగం క్రియా యోగం జ్ఞాన యోగం కర్మ యోగం వంటి అనేక యోగాలలో ఏ ఒక్క దానిద్వారానైనా పరిపూర్ణత సాధించిన మోక్షప్రాప్తి సంప్రాప్తిస్తుంది.

***             ---              ***                ---               ***

నిష్కామ కర్మ అన్నది ఎంతో జ్ఞానంతో గానీ పరిపక్వతతో గానీ అర్ధం కాదు ఆచరణకి అంతు బట్టదు. చేసే లేదా చేస్తున్న కర్మ ఫలప్రాప్తికి తన చిత్తం అంటకుండా చేసేదే నిష్కామకర్మ. కృష్ణార్పణం అనేది దానికీ ఒక simple solution. చేస్తున్న చేసిన కర్మ  జీవునికి అంటకుండా చేసే ప్రక్రియ. కర్మ మరియూ కర్మ బంధనమే జీవునికి పునర్జన్మ హేతువు.
సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు అని మూడు విధాలు.
సంచిత - ఎన్నో కోట్ల జన్మలలో చేసి పోగు చేసుకున్న కర్మ ఫలితం .
ప్రారబ్ధ - ఈ జన్మలో అనుభవించదగిన కర్మ ఫలితం.
ఆగామి - ఈ జన్మ కర్మ ఫలితం ద్వారా మిగిలే Total Balance Left Out.
NOTE: నిష్కామ, క్రియా యోగ తదితర పద్దతుల ద్వారా Zero out చేసుకోవచ్చు.

మన ఋషులు "ప్రారబ్ద కర్మ" ను మూడు విధాలుగా
విభజించారు  .......

1. ధృతకర్మ 2. ధృతాధృత కర్మ 3. అధృత కర్మ అని.

పూర్వజన్మలో  మన్నించడానికి  ఏ మాత్రం
వీలులేని  ఘోర తప్పిదం చేసినవాళ్ళు  -
"ధృత కర్మ" విభాగంలోకి  వస్తారు  ....
ఒకరిని  హత్యచేయటం, మోసం చేయటం వంటివన్నీ  ఈ భాగంలోనే  వస్తాయి.
వీళ్ళు  ఆ తప్పుకు శిక్షను  అనుభవింల్సిందే ఎంత శాంతి  చేసినా  ఏమి  ఫలితం  ఉండదు,
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ధృతాధృత కర్మ. అనగా క్రిందటి జన్మలో చేసిన తప్పు  క్షమించబడటానికి వీలున్నది, అంటే బొంబాయికి  టిక్కెట్టు కొనుక్కుని ప్రయాణీకుడు పొరపాటున ఢిల్లీ  వెళ్ళే రైలు ఎక్కి, TCకి అది పొరపాటున జరిగినదని  చెప్పటంతో  అతను జరిగిన తప్పు ఒప్పుకొని ప్రయాణీకుడికి జరిమానా వేయకుండా వదిలి వేయటం .......
•••••••••••••••••••••••••••••••••••••••••••••••
ఇక మూడవది అధృత కర్మ.  పూర్వజన్మలో చేసిన చాలా చిన్న పొరపాటు చేసినవ్యక్తికి సంప్రాప్తించేది, మనస్సులోకి ఏదో చిన్న చెడు తలంపు ప్రవేశిస్తుందే కానీ కార్య రూపంలోకి వెళ్ళదు. ఉదాహరణకి మీ ప్రక్కఇంట్లో మీకు నచ్చిన ఒక వస్తువు ఉందనుకోండి. దాన్ని "దొంగిలిస్తే" అనే ఆలోచన మీకు రావచ్చు కానీ మీరు దొంగిలించలేదు. ప్రక్క ఇంటికి  వెళ్లారు ఆ వస్తువు మీద చెయ్యి  కూడా  వేయబోయారు, అంతలో ఎవరో రావటం కనిపెట్టి ఆ క్షణమే తప్పు గ్రహించి చెడు తలంపును ప్రక్కకు నెట్టే వారు. పూర్వజన్మలో మీరు తలబెట్టిన చిన్న తప్పుకి ఈ జన్మలో చిన్న శాంతిచేసి ఆ చెడు తలంపు వల్ల మిమ్మల్ని అంటిన ఆ పాపాన్ని కడుక్కోగల్గుతారు  ........
````````````````````````````````````````````````````
కాబట్టి మొదటి విభాగంలోని వాళ్ళు తప్ప మిగిలిన రెండు విభాగాల్లోని వాళ్ళు శాంతి, గ్రహశాంతి  చేయించటం వాళ్ళకు ఈ జన్మలో మేలు చేస్తుంది అంతే  కాకుండా  రాబోయే  జన్మలో అది బ్యాంక్  బాలెన్స్‌గా మిగులుతుంది కూడా అందుకే జ్యోతిష్కులు శాంతి చేయించండని సలహాలిస్తుంటారు.
..... .........

కర్మ సిధ్ధాంతానికి స్వయానా పరమాత్మ కూడా లోబడి ఉంటాడు దాటలేరు అనే చిన్న ఉదాహరణ మనకోసం.

ఒకసారి శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు అతని స్నేహితులు ఆడుకుంటూ అటుగా వచ్చిన మహర్షులని చూసి ఆటప్పటిద్దాం అనుకున్నారు.

కడుపు వచ్చినట్లు నటించి మహర్షులు రాగానే "అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా" అని అడిగారు. నిజం గ్రహించిన మహర్షులు ఆగ్రహించి మీవంశాన్ని నిర్మూలించే ముసలం పుడుతుంది అని శపించి శ్రీకృష్ణుడిని దర్శించి వెళ్లిపోయారు..

సాంబుడు సహా ఇతర కుమారులంతా వచ్చి శ్రీకృష్ణుడి దగ్గర మొరపెట్టుకుంటే "అది మహర్షుల శాపం. దానికి తిరుగులేదు. నేను తిప్పలేను" మహాత్ములని అవమానించిన ఫలితం అనుభవించండి అని వదిలేశాడు.

కాలక్రమంలో వంశ నాశనం అయింది. మహాభారత యుద్ధం ముగిసింది. యాదవులు అహంకారంతో విర్రవీగుతున్నారు. తనమన బేధాలు మర్చిపోయారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే శ్రీకృష్ణుడి ఎదురుగానే తాగడం, మాంసాహారం తినడం , బూతులు మాట్లాడడం, శ్రీకృష్ణుడిని సైతం అవమానించేలా ప్రవర్తించడం చేశారు. అయన ముందే గొడవలు కొట్లాటలు అబ్బో ఇది అది అనికాదు. సకల దుర్గుణాల నిలయం అయ్యారు. ఒకరోజు యదవులందరూ  అందరూ కలిసి విహారయాత్రకని వెళ్లారు  సముద్రతీరానికి వెళ్లారు. తప్పతాగి మైకంలో ఒకరినొకరు దర్బలతో కొట్టుకొని చచ్చిపోయారు. అలా వంశనిర్మూలనం జరిగిపోయింది.

అనంతరం శ్రీకృష్ణుడు దేహం చాలించాడు. ద్వారకా నగరం కొద్దిసేపట్లో మునిగిపోతుందనగా అర్జునుడు మిగిలిన యాదవ స్త్రీలని శ్రీకృష్ణుడి భార్యల్ని తీసుకొని ఒడ్డుకి చేరుకున్నాడు. ద్వారకనగరం మునిగిపోయింది. ఇంతలో అక్కడికి అతి భయంకరులైన బోయలు కిరతులు వచ్చి కనిపించిన ఆడవాళ్ళని ఎత్తుకుపోయారు. కొందరిని చంపేశారు. శ్రీకృష్ణుడి భార్యల్ని సైతం వదలలేదు. ఎత్తుకుపోయారు. లక్షలాది శత్రువుని అవలీలగా జయించిన అర్జునుడు కిరాతులని ఏమి చేయలేక మిన్నకుండిపోయాడు. కళ్ళముందే ఎత్తుకుపోతుంటే నిష్చేష్టుడై పోయాడు..

కృష్ణుడిని పూజిస్తున్నాం ఆభగవంతుడి దగ్గర తప్పు చేస్తే ఎంతటి వారైనా ఒక్కటే. కట్టుకున్న భార్యల్ని, కన్నకొడుకులని బంధువులనే వదలలేదు.  మహానుభావులతో జాగ్రత్తగా లేకపోతె ఎవడు మిగలడు.  భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటే.. తప్పు చేస్తే ఫలితం అనుభవించాల్సిందే..

Jai Sri Ram..

Friday, 3 March 2017

అశ్విని నక్షత్రము గుణగణాలు

అశ్విని నక్షత్రము గుణగణాలు

అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు. అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధార్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతుతుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.

నవాంశ ఆధారిత గుణాలు

అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యధిపతి కుజుడు కనుక వీరు ధైర్యసైహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనికాధికారులు, అగ్నిమాపకదళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు.అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు

ఈ నక్షత్రం వారి గుణ గణాలు

అశ్వని నక్షత్రము ఏపాదంలో జన్మించినవారైనా అందం పెంపొదించుకోవాలని తాపత్రయపడతారు. ఎంతమందిని సలహాలు అడిగినా తన నిర్ణయాన్ని అమలు చేస్తారు.

అశ్వినీ నక్షత్ర జాతకులకు తారాఫలాలు

తార   నామం.  తారలు.   ఫలం జన్మ తార
అశ్విని, మఖ, మూల.  
 శరీరశ్రమ

సంపత్తార
భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢధనలాభం

విపత్తార
కృత్తిక, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢకార్యహాని

క్షేమత్తార
రోహిణి, హస్త, శ్రవణం
క్షేమం

ప్రత్యక్తార
మృగశిర, చిత్త, ధనిష్ట
ప్రయత్న భంగం

సాధనతార
ఆరుద్ర, స్వాతి, శతభిష
కార్య సిద్ధి, శుభం

నైత్యతార
పునర్వసు, విశాఖ, పూర్వాభాద్రబంధనం

మిత్రతార
పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్రసుఖం

అతిమిత్రతార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
సుఖం, లాభం

అశ్వని నక్షత్రము కొన్ని వివరణలు

నక్షత్రం - అశ్వని
అధిపతి- కేతువు
గణము - దేవ
జాతివృక్షం- పురుష అడ్డరస
జంతువు- గుర్రం
నాడి -ఆది
పక్షి -గరుడ
అధిదేవత- అశ్వని దేవతలు
రాశి -మేషం

అశ్విని కేతువు దేవ పురుషఅడ్డరస గుర్రం ఆది గరుడ అశ్వినీదేవతలు మేషం

అశ్విని నక్షత్రము నవాంశ

1 వ పాదము - మేషరాశి.2 వ పాదము - వృషభరాశి.3 వ పాదము - మిధునరాశి.4 వ పాదము - కర్కాటకరాశి.నక్షత్రానికి ఉన్న గుణలు కలిగిఉన్నా నవాంశని అనుసరించి నాలుగు పాదాల వారికి ప్రత్యేక గుణలు కొన్ని ఉంటాయి.అశ్వినీ నక్షత్రము మొదటి పాదములో పుట్టిన వారు క్రీడాకారులుగా రాణిస్తారు. వీరు వీరవైద్యల అమ్దు ఆసక్తి కలిగి ఉంటారు.అశ్వినీ నక్షత్రము రెండవ పాదములో పుట్టిన వారు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి సంభందించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధవహిస్తారు.అశ్వినీ నక్షత్రము మూడవపాదములో పుట్టిన వారు విద్యలయందు అసక్తి కలిగి ఉంటారు.అశ్విణీ నక్షత్రము నాల్గవ పాదములో పుట్టిన వారు ఆయుర్వేదము వంటి వైద్యము, ఔషధతయారీ వంటి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటారు.

అశ్విని నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలములు

సంఖ్యలు

1, 4, 5, 9

మణి

వైఢూర్యం/రత్నం

వారములు

ఆదివారము, బుధవారము, శుక్రవారము

ఫలములు

ఏకాగ్రత
అశ్వని నక్షత్ర విశేషాలు :

ప్రాథమికంగా అశ్వనీ నక్షత్రం సన్య నక్షత్రంగా పురుష లక్షణంతో క్షిపుతారగా గుర్తింపు పొందింది.  దీనికి అధిపతి కేతువు.
ఈ నక్షత్రంలో జన్మించినవారు పరమేశ్వరార్చన చేసి వైడూర్యాన్ని ధరించవలసి ఉంటుంది.  అశ్వని 4పాదాలూ మేష రాశిలోనే ఉన్నాయి.

అశ్వని మొదటి పాదం

సామాన్య స్థితితో ఆరాటం ఎక్కువగా ప్రదర్శిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. రాజీ ధోరణితో ఉండాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడంవల్ల రకరకాల ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సామాజికంగా గౌరవం పొందాలన్న తపన కనబరుస్తారు.
గ్రహ దశలు
పుట్టిననాటినుంచి కేతు మహర్దశ 7 సం.లు, శుక్ర మహర్దశ 20 సం.లు, రవి మహర్దశ 6 సం.లు, చంద్ర మహర్దశ 10 సం.లు, కుజ మహర్దశ 7 సం.లు అనుభవిస్తారు.
దర్శనీయ క్షేత్రం
తూర్పు గోదావరి జిల్లాలోని బ్రహ్మపురిలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వారిని సందర్శించుకుంటే అస్థిరత ఉపశమించగలదు.

అశ్వని రెండో పాదం

అశ్వని రెండో  పాదంలో జన్మించినవారు పట్టుదలను అధికంగా ప్రదర్శిస్తారు. ఇతరుల భావాన్ని త్వరగా గ్రహించడం వీరు చురుగ్గా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రాజ్ఞులు, దక్షులుగా గుర్తింపు పొందుతారు. సొంత బలం, సొంత ఆలోచనలపై నమ్మకం కలిగిఉంటారు.
గ్రహ దశలు
వీరు పుట్టినప్పటినుంచి కేతు దశ (సుమారుగా) 5సం. 3 నెలలు, శుక్ర మహర్దశ 20 సం, రవి మహర్దశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ మహర్దశ 7 సం.లు అనుభవిస్తారు.
దర్శనీయ క్షేత్రం
తూ.గో.జిల్లాలోని ఉప్పుమిల్లిలో కొలువైన శ్రీబాలా త్రిపురసుందరి సమేత భవానీ శంకర స్వామిని దర్శించుకోవాలి.

అశ్వని మూడో పాదం

వీరికి ప్రాచీన శాస్త్రాలపై ముఖ్యంగా జ్యోతిష, తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో పేరుగాంచుతారు.  అయితే ఆయా సలహాలవల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు. స్వధర్మ నిరతులై ఉంటారు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు.
గ్రహ దశలు
పుట్టినప్పటినుంచి కేతు మహర్దశ (సుమారుగా) మూడున్నర సం.లు, శుక్ర  20 సం, రవి 6 సం, చంద్ర 10 సం, కుజ దశ 7 సం., రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం
కుయ్యేరులోని శ్రీబాలా త్రిపురసుందరి సమేత మల్లేశ్వరస్వామిని అర్చిస్తే శుభం కలుగుతుంది

అశ్వని నాలుగో పాదం

అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. చక్కటి ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. విభిన్నమైన విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్యసాధనలో వెనుకంజ వేయరు. వీరికి ఫలితం సునాయాసంగా అందదు. శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది.
గ్రహ దశలు  
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ (సుమారుగా) 7 సం. 9 నెలలు, శుక్ర  20 సం, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం  
ఈ పాద జాతకులు దుగ్గుదుర్రులోని శ్రీపార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వారిని అర్చించుకోవాలి.

 నక్షత్ర మండలం

జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం మండలాన్ని 12 రాశులుగా విభజించారు. వీటికి 27 నక్షత్రాలను పాదాలవారీగా వర్గీకరించారు. ఆ ప్రకారం ప్రతి నక్షత్రంలోనూ నాలుగు పాదాల్ని గుణించడంద్వారా 27x4=108 పాదాలు అవుతాయి. వీటిని తొమ్మిది చొప్పున సమంగా సర్దినట్టయితే ప్రతి రాశిలోనూ 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. దీని ఆధారంగా పుట్టిన సమయంలో నక్షత్ర సమ యాన్ని 4 భాగాలుగా విభజిస్తారు

జాతక చక్రంలో నక్షత్ర ప్రాధాన్యం

మానవ జీవితం భూమండలంపై ఉండే వివిధ పరిస్థితులతో ముడిపడి ఉంటుంది.  ఈ పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉండవు. ఈ విశ్వాన్ని శాసించే గ్రహాలు, నక్షత్రాల చేతుల్లో ఉంటాయి.  ఆయా గ్రహాల, నక్షత్రాల ప్రీత్యర్థం ఏం చేయాలనే అంశాన్ని కూడా మన పూర్వీకులు జ్యోతిష, ప్రాచీన గ్రంథాలలో సవివరంగా తెలియజేశారు.
రాశి, నక్షత్రం, నక్షత్ర పాదం తెలుసుకొన్నట్లయితే జాతకుడి స్థితిగతులు గ్రహించవచ్చు. అలాగే జాతకుడు తన నక్షత్రాన్ని బట్టి ఆయా నక్షత్ర క్షేత్రాలను దర్శించుకొన వీలుంది. ఈ క్షేత్రాల వివరాలను ప్రాచీన శైవాగమ గ్రంథాలలో పొందుపరిచారు. ఆయా క్షేత్రాలలోని పరమేశ్వరుడిని భక్తితో అర్చిస్తే సంబంధిత నక్షత్రం ఆశీసులు పొందవచ్చును.

క్షేత్ర ప్రదేశాలు

నక్షత్ర క్షేత్రాలన్నీ పావన గోదావరి తీరంలోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం, కోటిపల్లి, రాయవరం మండలాల్లో ఉన్నాయి. వీటిని తమ తమ నక్షత్రానుసారంగా సందర్శించాలి.
శుభకర తిథి వారాలు
రోజులలో సోమవారం, తిథులలో ఏకాదశి, నక్షత్రాలలో ఆర్ద్ర మంచివి. ఆయా రోజులలో, తిథులలో పరమేశ్వరుడిని అర్చించడంవల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.  
 అశ్వని]CAT’S EYE [వైడూర్యము. నామ అక్షరము (చూ.)

2 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము ( చే)

3 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (చో)

4 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (లా)
అను అక్షరములు గల పేర్లు పెట్టవలెను.

Sunday, 26 February 2017

Telugu proverb

ఎవడికైనా తనదాకా వస్తేగానీ తత్వం బోధపడదులెండీ..

తిరుమల గురించి 11 నిజాలు....గోవిందా గోవిందా

తిరుమల గురించి 11 నిజాలు....

1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.

3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.

4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.

5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.

6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.

7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.

9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.

10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.

11. క్రీ.శ.1800 సం.లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.

మీరు కూడా చదివి 18 మందికి పంపండి, త్వరలో మంచివార్త వింటారు.
🙏🙏గోవిందా గోవిందా🙏🙏

Tuesday, 31 January 2017

మీరు పుట్టిన తేదీ బేసి సంఖ్య అయితే జీవితం ఇలా ఉంటుందట!!

మీరు పుట్టిన తేదీ బేసి సంఖ్య అయితే జీవితం ఇలా ఉంటుందట!! - Touch Lo Unte Chepta https://touchlountechepta.in/besi-sankya-ithe/

Sunday, 29 January 2017

Maaghamasam Importance / About Maaghamasa Puranam

మాఘ పురాణం -🌹🌹🌹🌹
మాఘమాసం మహిమ -🌹🌹🌹🌹
1వ అధ్యాయము - మాఘమాస మహిమ   🌹🌹🌹🌹

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||

           ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది  పర్వతములు, గంగాదినదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.

       పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి 'స్వామీ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ, పావనమూ, సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ, అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట, ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో, ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆయాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.

             ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూతమహర్షి వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు, రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.

          సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి, పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి, వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత, నాకు తెలిసిన విషయాన్ని, మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను, మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు 'సూతమహర్షి లోగడ వైశాఖమాసం, కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని' కోరారు.
 అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా, యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది.పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే  విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.

          పార్వతీదేవి పరమేశ్వరునితో "విశ్వాత్మకా! సర్వలోకేశ్వరా! సర్వభూతదయానిధీ! ప్రాణేశ్వరా! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని" ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు "కళ్యాణీ! జగన్మంగళా! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును? తప్పక చెప్పెదను,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగట్టును. రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా, తెలిసికాని, తెలియకకాని, బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.

           మాఘస్నానమును మాని, విష్ణువునర్చింపక, దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును? అతడు భయంకరమైన కుంభీపాకనరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు, నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనందుదురు సుమా, దరిద్రులైనను, బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.

          ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను, మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని, భయముచే గాని, బలవంతముగాగాని, మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని, చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.

          పార్వతీ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని, ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షముత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడుత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములుత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని, నిందించినను, నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమనంత పుణ్యప్రదము సుమా.

           దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను.మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు 'మహారాజా! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నానేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని, సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.

           దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును.మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమేయింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము.

           పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య-హిమాలయపర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణుల మిక్కిలి బాధపడినవి, అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.

           ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమైవిచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగమువలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు, నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.

           భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసినకొనవలయును.ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము, మాఘమాసములో నదిలోగాని, సముద్రములోగాని, కాలువలోగాని, సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. నీ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును  యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును, తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై, మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునంది తన భార్యలో బాటు తనలోకమున కరిగెను. దిలీపమహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.

🌹🌹🌹🌹

ఈ రోజు నుండే మాఘమాసం మొదలు అవుతుంది మాఘమాసం గురించి తెలుసుకొందాం.

చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.

మాఘ పూర్ణిమను ‘మహామాఘం’ అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.

మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలోఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం

తిథులు:-

1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. 2. శుద్ధ విదియ 3. శుద్ధ చవితి 4. శుద్ధ పంచమి 5. శుద్ధ షష్టి 6. శుద్ధ సప్తమి 7. అష్టమి 8. నవమి 9. ఏకాదశి 10. ద్వాదశి 11. త్రయోదశి 12. మాఘ పూర్ణిమ 13. కృష్ణపాడ్యమి 14. కృష్ణ సప్తమి 15. కృష్ణ ఏకాదశి 16. కృష్ణద్వాదశి 17. కృష్ణ చతుర్దశి 18. కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది🌹🌹🌹🌹
2వ అధ్యాయము - శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమ చెప్పుట

             వశిష్ఠులవారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను." మహాముని! ఈ మాఘమాస మహత్యమును యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిం" డని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచూ, నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజననియగు పార్వతీదేవివచ్చి భర్తపాదములకు నమస్కరించి, 'స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని, కానీ, ప్రయాగక్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలెననడి కోరికవున్నది. కాన, ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని' వేడుకొనగా, పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను, దేవి! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము.

             సూర్యుడు మకరరాశియందువుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక, జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా, ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాదు జీవనది వున్నను, లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని, తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతకాలస్నానము గొప్పఫలము నిచ్చుటయేగాక సమస్తపాపములను విడిపోవును. రెండవరోజు స్నానముజేసిన విష్ణులోకమునకు పోవును. మూడవనాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ! మాఘమాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నదికాని, చెరువు కాని, నుయ్యి కాని, కాలువకాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి, సూర్యభగవానునకు నమస్కరించి, తనకు తోచిన దానధర్మములుచేసి శివాలయమునగాని విష్ణ్వాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింతగాదు.

              ఏ మానవుడైననూ తన శరీరములో శక్తిలేక, కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘములవలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధయాగము చేసినంతఫలము దక్కును. అదియునుగాక, మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలోస్నానముచేసి, శ్రీమన్నారాయణుని పూజించి, సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి, విష్ణు అందిరమునగాని, శివాలయమున గాని దీపము వెలిగించి, ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక, పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక, స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోరపాపములుచేసి మరణారంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె, తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీస్నానము చేసి, దానధర్మాది పుణ్యముల  నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరముగదా! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ! యే మానవుడు మాఘమాసమును తృణీ కరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను సావదానముగా ఆలకింపుము.

                 నేను తెలియజేసిన విధయముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున నదీస్నానముగాని, జపముగాని, విష్ణుపూజగాని, యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును, ఱంపములచేత, ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి, కాలకృత్యములను తీర్చుకొని, నదికిపోయి స్నానము చేసి, సూర్యనమస్కారము విష్ణుపూజా చేసి తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవతనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు యేస్త్రీ అటులచేయదో, అట్టి స్త్రీముఖము చూచినంతనే సకలదోషములూ కలుగుటయేగాక ఆమె పంది, కుక్క జన్మలనెత్తి హీనస్థితినొందురు. మాఘమాసస్నానమునకు వయఃపరిమితిలేదు, బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైననూ, జవ్వనియైననూ, ఈ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటియజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.

              పార్వతీ! దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, గురు భార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసచేయువారు మాఘమాసములో నదీస్నానము చేసి విష్ణువును పూజించినయెడల వారి సమస్తపాపములు నశించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైనవాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయనివాడునూ, యితరులనువంచించించె వారివద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్ధుగడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదావ్యభిచార గృహములలో తిరిగి, తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను యెగతాళిచేయువాడును, గర్వముకలవాడై తానే గొప్పవాడనని

అహంభావముతో దైవకార్యములనూ ధర్మకార్యములనూ చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడుపనులకు ప్రేరేపించువాడను యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవీ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూరకర్మములు ఆచరించువారు, సిగ్గువిడిచి తిరుగువాడు, బ్రాహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. యే మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో, అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి, యెటువంటి దోషములూలేక పరిశుద్ధుడగును, అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ! పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు, అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచేత ఆ మాసమంతా ఆచరించెడి యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానముచేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వౄద్ధులు, జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ్లోలోస్నానము చేయలేరు. కాన, అట్టివారికి యెండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించినయెడల ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారినిదర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభఫలితము కలుగును.

              ఈ విధముగా ఆచరించెడి వారినిజూచి, యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబసభ్యులందరినీ మాఘమాస  స్నానమాచరించునటుల యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని, వైశ్యునికికాని, క్షత్రియునికి కాని, శూద్రునికికాని మాఘమాసస్నానమును చేయుమని చెప్పినయెడలవారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులునూ ఉండవు. మాఘమాసస్నానములు చేసినవారిని గాని, చేయలేని వారినికాని, ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక, ఆయుఃక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు, ముఖము కడుగుకొని, తలపై నీళ్ళుజల్లుకొని, సూర్యనమస్కారములు చేసి, మాఘపురాణమును చదువుటగాని, వినిటగాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము, దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానముకన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా, వంద అశ్వ మేధయాగములుచేసి, బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగ్ను. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంత యును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన, నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము.

Saturday, 28 January 2017

Maghamasam Visistatha

1వ అధ్యాయము - మాఘమాస మహిమ   వంశీ నేమాని🌹🌹🌹🌹

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||

           ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది  పర్వతములు, గంగాదినదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.

       పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి 'స్వామీ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ, పావనమూ, సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ, అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట, ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో, ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆయాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.

             ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూతమహర్షి వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు, రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.

          సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి, పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి, వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత, నాకు తెలిసిన విషయాన్ని, మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను, మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు 'సూతమహర్షి లోగడ వైశాఖమాసం, కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని' కోరారు.
 అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా, యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది.పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే  విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.

          పార్వతీదేవి పరమేశ్వరునితో "విశ్వాత్మకా! సర్వలోకేశ్వరా! సర్వభూతదయానిధీ! ప్రాణేశ్వరా! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని" ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు "కళ్యాణీ! జగన్మంగళా! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును? తప్పక చెప్పెదను,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగట్టును. రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా, తెలిసికాని, తెలియకకాని, బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.

           మాఘస్నానమును మాని, విష్ణువునర్చింపక, దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును? అతడు భయంకరమైన కుంభీపాకనరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు, నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనందుదురు సుమా, దరిద్రులైనను, బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.

          ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను, మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని, భయముచే గాని, బలవంతముగాగాని, మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని, చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.

          పార్వతీ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని, ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షముత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడుత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములుత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని, నిందించినను, నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమనంత పుణ్యప్రదము సుమా.

           దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను.మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు 'మహారాజా! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నానేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని, సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.

           దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును.మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమేయింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము.

           పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య-హిమాలయపర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణుల మిక్కిలి బాధపడినవి, అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.

           ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమైవిచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగమువలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు, నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.

           భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసినకొనవలయును.ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము, మాఘమాసములో నదిలోగాని, సముద్రములోగాని, కాలువలోగాని, సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. నీ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును  యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును, తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై, మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునంది తన భార్యలో బాటు తనలోకమున కరిగెను. దిలీపమహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.
రేపు రెండవ భాగంతో కలుద్దాం !🌹🌹🌹🌹

Monday, 23 January 2017

Indian Territory (Hindu Rashtra before 1000 AD)

No automatic alt text available.

మిత్రులారా! కన్నులుండి చూడలేని బుర్రుండి ఆలోచన లేని  హిందువులారా ఇది కాస్త చదవండి!

1378 లో భారతదేశం నుంచి ఒక భాగం వేరు పడి ఇస్లామిక రాజ్యం అయింది - దాని పేరు ఇరాన్.
1761లో భారతదేశం నుంచి మరో భాగం వేరు పడి మరో ఇస్లామిక్  రాజ్యం ఏర్పడింది – దాని  పేరు అఫ్ఘనిస్థాన్.
1947లో భారత్ నుంచి మరోభాగం వేరుపడి మరో ఇస్లామిక్ రాజ్యం ఆవిర్భవించింది – దాని పేరు పాకిస్థాన్
1971లో అదే పాకిస్థాన్ నుంచి మరో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడింది – దాని పేరు అఫ్ఘనిస్థాన్
1952 నుంచి 1990 మధ్య భారత్ లో మరో భాగం ఇస్లాం మయం అయింది – దాని పేరు కాశ్మీర్
ఇపుడు ఉత్తర ప్రదేశ్, అస్సామ్ మరియు కేరళలను ఇస్లామిక్ రాజ్యాలుగా తయారు చేయాలనే పనిలో పడ్డారు ఈ జిహాదీలు.
ఎపుడైన మనం మన తోటి హిందువులను, హిందూ సంస్కృతిని జాగృతం చేద్దామనుకున్నవాళ్లను...RSS, VHP మరియు శివసేన, BJP తొత్తులు అంటూ మన మీద ఒక రకమైన ముద్ర వేస్తున్నారు.
 ఇప్పటి వరకు చదివిన వారు...మరికాస్త ఓపికగా కింది పోస్ట్ ను దయచేసి చివరి వరకు చదవగలరు...
ధర్మం పేరు మీద భారత్ ను ముక్కలు చేసిన జిన్నా ముస్లిము.
కోట్లాది హిందువుల రక్తాన్ని పారించిన ప్రతి సుల్తాను ముస్లిమే.
ఎంతో మంది హిందువులను ఇస్లామ్ లో మారేటట్టు చేసిన (తబ్లీక్)ను ప్రవేశపెట్టిన అరబ్బులు ముస్లిమ్ లే.
అయోధ్యలో రామ మందిరాన్నికూల్చిన బాబరు కూడా ముస్లిమే.
హిందూ ధర్మ కోసం పోరాడిన గురు తేగ్ బహదూర్ తల నరికిన ఔరంగజేబు ముస్లిమే.
కాశ్మీర్ లో పండిత్ లను నరసంహారం చేసిన ప్రతి ఉగ్రవాది ముస్లిమే.
1993లో ముంబాయి బాంబ్ బ్లాస్ట్ చేసిన దావూద్ ఇబ్రహీం కూడా ముస్లిమే.
భారత్ లో అక్రమంగా ప్రవేశించిన 5 కోట్ల బంగ్లా దేశీయులు కూడా ముస్లిములే.
బుద్దుడు, మహావీరుడు వంటి మూర్తులను విరగ్గొట్టిన ప్రతి ఆతంకవాది ముస్లిమే.
పవిత్రమైన భారత  పార్లమెంటుపై దాడిచేయించిన అఫ్జల్ గురు కూడా ముస్లిమే.
గోద్రాలో కరసేవకులను రైళ్ల పెట్టెలో సజీవ దహనం చేసిన జిహాదీలు ముస్లిములే.

26/11 లో ఎంతోమంది అమాయకులను బలిగొన్న కసబ్ ముస్లిమే.
అమర్ నాథ్ యాత్ర పై ఆంక్షలు విధించాలని చెప్పిన గిలానీ ముస్లిమే.
కాశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రికులపై జిజియా పన్నులాంటిది...
 వసూళు చేయాలని చెప్పిన ఒక కాశ్మీరీ మంత్రి కూడా ముస్లిమే.
100 కోట్లకు పైగా హిందూవులను నరుకుతా అని ప్రతిజ్ఞ చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ ముస్లిమే.
దానితో పాటు...ఆవులను నరికి తినే ప్రతివాడు ముస్లిమే.
మనదేశంలో వుంటూ వందేమాతరం, భారత్ మాతాకీ జై అనిని వాడు కూడా ముస్లిమే.
కాశ్మీర్ లో భారత్ ముర్ధాబాద్ అనే ప్రతివాడు ముస్లిమే.
హైదరాబాద్ లో భారత జాతీయ పతాకాన్ని కాల్చివాడు ముస్లిమే.
లవ్ జిహాద్ చేసిన షారుఖ్, అమీర్, సైఫ్ లు కూడా ముస్లిములే.
దేశ వినాశాన్ని కోరుకునేవాళ్లకు సాయం చేసే ప్రతి కాంగ్రెస్ వాది ముస్లిమే.
ఎవడైతే ఈ మెసేజ్ చదివి ఫార్వడ్ చేయడో వాడుకూడా ముస్లిమే.
ఎవరైతే జిహాది ముస్లిమ్ లున్నరో వారందరికి గట్టి జవాబు ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది.
ఈ రోజు తెలుస్తుంది మన హిందువుల ఐక్యత ఏ పాటిదో...!
 వందేమాతరం
మీ భరతమాత ముద్దుబిడ్డ
   మొత్తానికి
ము – ములాయం
స – సోనియా
ల – లాలు
మా – మమత
న్ – నితిష్ కుమార్
జాగో హిందూ జాగో ...!