Friday, 3 July 2020

About Steve Waugh and Ganga

ఆస్ట్రే లియా క్రికెట్ మాజీ కెప్టెన్
steve waugh
అతని మిత్రుని చివరి కోరిక ప్రకారంగా
అతని మరణ అనంతరం
ఆ అస్థికలను తీసుకువచ్చి కాశిలో గంగా నదిలో కలిపారట.
ఇదీ మన సనాతన ధర్మం గొప్పతనం.
ఇదీ మన భారత దేశ భూమి యొక్క, నదుల యొక్క ఔన్నత్యం.

ఇతర మతాలవాల్లు ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా,
నేను ఇక్కడ ఓ మాట మాత్రం నిష్కర్షగా చెప్పదలుచున్నాను.
అసలు ఏ మతంవారైనా ఈదేశంలో పుట్టారంటేనే వారు చాలా పుణ్యాత్ములని అర్ధం.
పుణ్యాత్ములు కాని వారికి ఈదేశంలో జనన మరణాలు రావు.

అంత గొప్పది మన భారత దేశం.
అందునా అవిముక్త( ఎన్నటికి ఎన్ని కల్పాలు గడిచినా యుగాంతాలలో కూడ నాశనము లేని) కాశిక్షేత్రం
ఇంకా ఇంకా ఎంతో పరమ పావనమైనది.

ఏ క్షేత్రంలోనైనా ఏదైనా పుణ్యాలు చేసుకుంటేనే ముక్తి వస్తుందేమో!
కానీ ఈ కాశి లో ఏం చేయక పోయినా ఇక్కడ చస్తే చాలు అదే ముక్తి.

అందుకే ఈ ప్రపంచంలో అంతా బతక టానికి చచ్చినంత పనై బతుకుతూ  ఉంటే
ఇక్కడ ఈ కాశిలో మాత్రం చావటం కోసమే ఎదురు చూపులు చూస్తూ బతుకుతూ  ఉంటారు.

అటువంటి ఆ కాశీ క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ఏ క్షేత్రమైనా వెడతాము అనుకుంటే వెళ్లి తీరాలి
లేకపోతే చాలా దోషం అని చెప్తారు.
అందువల్ల వెళ్లగలిగితేనే మొక్కు కోవాలి
లేకపోతే లేదు అంతే.
కాని కాశి క్షేత్రం అలా కాదు.
నువ్వు వెల్లగలిగినా వెల్లలేక పోయినా,

"అహం కాశీం గమిష్యామి
తత్రైవ నివసామ్యహం
ఇతి బ్రువాణ సతతం
కాశివాస ఫలం లభేత్||"

నేను కాశి వెడతాను
నేను కాశిలో ఉంటాను
ఇలా నిరంతరం అనుకున్నంత మాత్రంచేతనే
కాశిలో నివాసం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వాక్యం.
అంత గొప్పది కాశి క్షేత్ర మహాత్మ్యం.

ఆ గంగా నదీమతల్లి మహాత్మం కూడా అంతటిదే.

"గంగా గంగేతి యోబ్రూయాత్
యోజనానాం శతైరపి
ముచ్యతే సర్వ పాపేభ్యః
విష్ణు లోకం సగచ్చతి||"

మనం గంగానదికి ఎన్ని వందల యోజనాల మైళ్ల దూరంలో ఉండి ఉండినా,
మనం స్నానం చేసేటప్పుడైనా
ఏ పుణ్యకార్యం చేసేటప్పుడైనా
గంగా గంగా అని పలికితే చాలు
మన సకల పాపాలు తొలగి పోయి
విష్ణు లోకాన్ని పొందుతామని పురాణ వాక్యం.

అటువంటి గంగ ఎక్కడైనా పవిత్రమే,
కాని అదే గంగ కాశిలో ఉండగా అయితే
ఆ పవిత్రత వర్ణించటం ఆ శంకరునికే అసాధ్యం.

అటువంటి ఆ కాశి గంగలో అస్థినిమజ్జన గొప్పతనం గురించి
గరుడ పురాణం లో ఓ గాధ ఉంది.
ఒక కిరాతకుడు ఆ జన్మలో తను ఎన్నో పాపాలు చేసి ఉన్నా
తన పూర్వ జన్మ సుకృతం వల్ల తన మరణానంతరం
అడవిలో పడిఉన్న అతని భౌతిక దేహంనించి
మాంసంతో కూడిన ఓ ఎముక ముక్కను
ఒక కాకి ముక్కున కరచి పట్టుకుని
గంగానదిమీదుగా పైన  ఎగురుతూ ఉండగా
ఆ కాకి ముక్కునించి ఆ ఎముక పొరపాటున జారి
ఆ గంగా నదిలో పడుట వలన అంత మాత్రం చేతనే
ఆ కిరాతకునికి మోక్షం సంభవించినదని గరుడ పురాణ వాక్యం.

అటువంటి మహా మహిమాన్వితమైన ఆ కాశిక్షేత్రం తో కూడిన
ఈ భారత దేశంలోమనం జన్మించటం మన అదృష్టం.

ఇతర దేశాల వాల్లు ఇతర మతాలవాల్లు మన భారత ధేశ వైదిక సాంప్రదాయ ధర్మం యొక్క
విలువను గుర్తించి ఈ ధర్మం పట్ల అనురక్తులు అవుతూ ఉంటే,
ఈ దేశంలో ఈ హిందూ ధర్మంలో పుట్టినకొంతమంది అజ్ఞానంతో అమాయకత్వంతో
ఎండమావులవెంట పరుగులెడుతున్నారు.

Friday, 26 June 2020

What is Pooja and the essence of its Process and Termonology

#ఈ పూజ ల పరమార్థం ఏమిటి..?                              💠పూజ                                           
💠అర్చన                                                          💠జపం.                                 
💠స్తోత్రం.                                                                  💠ధ్యానం.                                                              💠దీక్ష.                                                                        💠అభిషేకం.                                                💠మంత్రం.                                                            💠ఆసనం.                                                                  💠తర్పణం.                                                                💠గంధం.                                                              💠అక్షంతలు.                                                    💠పుష్పం.                                                  💠ధూపం.                                                              💠దీపం.                                                                    💠నైవేద్యం.                                                            💠ప్రసాదం                                                                💠ఆచమనీయం.                                                  💠అవాహనం.                                                            💠స్వాగతం.                                                                💠పాద్యం                                                          💠మధుపర్కం.                                                            💠స్నానం.                                                                  💠వందనం.                                                              💠ఉద్వాసన....                                                                     
పూజ-పరమార్థాలు:

పూజ -->⏩ పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.

అర్చన-->⏩ అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.

జపం-->⏩ అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.

స్తోత్రం-->⏩ నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.

ధ్యానం-->⏩ ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.

దీక్ష-->⏩ దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.

అభిషేక:-->⏩ అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.

మంత్రం-->⏩ తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.

ఆసనం-->⏩ ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.

తర్పణం-->⏩ పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.

గంధం-->⏩ అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.

అక్షతలు-->⏩ కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.

పుష్పం-->⏩ పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.

ధూపం-->⏩ చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.

దీపం-->⏩ సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.

నైవేద్యం-->⏩ ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.

ప్రసాదం-->⏩ ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.

ఆచమనీయం-->⏩ లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .

ఆవాహనం-->⏩ పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.

స్వాగతం-->⏩ దేవతను కుశలప్రశ్నవేయుట.

పాద్యం-->⏩ చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.

మధుపర్కం-->⏩ తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.

స్నానం-->⏩ గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.....

వందనం-->⏩ అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం)......

ఉద్వాసన-->⏩ దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు...

🙏🙏🙏

Saturday, 30 December 2017

Who Translated Bhagavadgeeta to various languages....?

భగవత్గీత ని వివిధ భాషల్లో కి అనువాదం చేసినది ఎవరు??

పోస్ట్ చివరి దాకా చదవండి మీకోక షాక్ తగులుతుంది

భగవత్గీత ని ఉర్దూ లోకి అనువదించిన వ్యక్తి
మొహమ్మద్ మెహరుల్లా (హిందూ ధర్మం స్వీకరించారు)

అరబిక్ లోకి అనువదించిన వ్యక్తి ఈ.ఎల్.ప్యాచ్ కమండో(ఇస్కాన్ లో చేరిపోయారు)

ఇంగ్లీష్ లోకి అనువదించిన వ్యక్తి
చార్లెస్ విల్కినోస్
"సనాతన ధర్మం ఒక్కటే ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వగలదు" అని అన్నారు

బ్రెజిల్ లోకి అనువాదం  చేసిన వ్యక్తి
బ్రాకెట్స్ లోవి వాళ్ళ ఒరిజినల్ పేర్లు హృదయనంద గోస్వామి( హోవార్డ్ జె. రేనిస్క్) అలానే నలుగురు భక్తులతో కలిసి చేసాడు
మహాకాళ దాస( లిమా మరికొ పొమ్బో)
లోకసాక్షి దాస (లుకో వలేర)
ఆరాధ్య దాస(కార్లోస్ ఫెర్నాండెస్ అమరో)
ఈశ్వర దాస(ఎనియస్ గువెర్రియో)

రష్యన్ లోకి అనువదించిన వ్యక్తి నోవికోవ్(కృష్ణ భక్తుడు ఐపోయాడు)

ఇప్పుడు ప్రపంచంలో వేరు వేరు భాషల్లోకి చేసిన వారి పేర్లు తెలుసుకుందాం

హీబ్రు లోకి అనువాదం చేసినవారు (ఈయన ఇశ్రాయేలీయుడు) బేజాషుటోన్ లీ ఫనా

జర్మన్ లోకి అనువాదించిన వ్యక్తి
ఫిడెరిక్ మేయర్

పర్షియన్ లోకి అనువదించిన వ్యక్తి
 దారా షికోహ్

చైనీస్ లోకి అనువాదం చేసిన వారు
జెన్ కెము,జోవ గువోహ్వ ఇద్దరితో జి బిజూహాంగ్
అలానే హువాంగ్ బావోషేంగ్ తో మరో నలుగురు
గువో లియాంగన్,లీ నాన్,జి వెయిజన్,డ్యూయన్ కీన్గ్ ఒక కమిటీ లాగా ఏర్పడి అనువాదం చేశారు

స్పానిష్ లోకి అనువాదం చేసిన వారు హార్మోన్డ్స్ వర్త్, రైడర్&కో

జనపనీస్ లోకి అనువాదం చేసిన వ్యక్తి
సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ఒక జపనీస్ మహిళ ని వివాహం చేసుకుని ఆ భాష లోకి అనువాదం చేశారు

లాటిన్ లోకి అనువాదం చేసిన వ్యక్తి
ఆగస్టు విల్హేమ్

ఫ్రెంచ్ లోకి అనువాదం చేసినది
పర్రాడ్

గ్రీకు లోకి అనువాదం చేసినది
జార్జ్ కె. టైపాల్ దాస్

ఇప్పటి వరకు మన భగవత్గీత ని 230 భాషల్లో మేధావులు అనువదించారు వాళ్ళల్లో

58 బెంగాలీ
44 ఇంగ్లీష్
12 జెర్మన్
4 రష్యన్
4 ఫ్రెంచ్
13 స్పానిష్
5 అరబిక్
3 ఉర్దూ అలానే మరెన్నో భాషల లోకి అనువాదాలు ఉన్నాయి

చివరి ట్విస్ట్

ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఖురాన్ ని
బెంగాలీ లోకి అనువదించినది గిరీష్ చంద్రసేన్....కానీ ఆయన ముస్లిం అవ్వలేదు హిందూ గానే కొనసాగుతున్నారు 😜😝

Friday, 10 March 2017

Why India is called as Bharat from Ancient Days...

1. మనదేశానికి #భరతదేశమని పేరురావటానికి కారణమైన భరతుని పెంచి పెద్దచేసినది - #శకుంతల
(దుష్యంతుడు కారణాంతరాలవల్ల భరతుణ్ణి తన కొడుకే కాదన్నాడు)
2. ఆరు సంవత్సరాల బాలుణ్ణి ప్రోత్సహించి, విష్ణు దర్శనం చేయించి ధృవమండలంలో శాశ్వితంగా వెలుగొందే స్థానానికి చేర్చినది - తల్లి #సునీతి....
3. ఇంద్రుణ్ణి ఓడించి అమృత భాండాన్ని భువికి తెచ్చేంత వీరునిగా గరుత్మంతుణ్ణి పెంచినది - తల్లి #వినతాదేవి....
4. ప్రహ్లాదుణ్ణి అనన్య విష్ణు భక్తునిగా చేసినది - తల్లి #లీలావతి....
5. హనుమంతుణ్ణి పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో అనన్య సామాన్యునిగా చేసినది - #అంజనాదేవి
6. లవ-కుశులను పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో తండ్రికి తగ్గవారిగా చేసినది - #శీతాదేవి....
7. భీష్ముడిని పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో అనన్య సామాన్యునిగా చేసినది - #గంగాదేవి....
8. పాండవులను  పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో అనన్య సామాన్యులుగా చేసినది - #కుంతీదేవి....
9. శాతకర్ణిని  పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో అనన్య సామాన్యునిగా చేసినది - #గౌతమీదేవి....
10. శివాజీ మహరాజ్ ను  పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి శక్తి-సామర్ధ్యాలలో అనన్య సామాన్యునిగా చేసినది - #జిజియాభాయి....
11. #గాంధీ,,
12.#అబ్దుల్_కలాం గారు,,
13.మన ప్రియతమ #ప్రధాని_మోడీ గారు మొ!! వారి జీవితాలలో తల్లుల పాత్రలను ప్రత్యక్షంగా చూస్తున్నాం....

ఈ భూమిపై మనిషిగా మనం చేయగలిగిన అత్యుత్తమమైన విధులలో పిల్లలను ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దడం అతి ముఖ్యమైనది....
ఈ పని తల్లులు సమర్ధవంతంగా చేయగలరు....
నేటి సామాజిక పరిస్తితులలో అది కొరవడడం వల్లనే అన్ని సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి....

Lord Surya Bhagavan Temple. మార్తాండ సూర్య దేవాలయం.....!!

మార్తాండ సూర్య దేవాలయం.....!!

కాశ్మీర్ లో ఒకప్పుడు అత్యంత సుందరం గా శోభిల్లిన మార్తాండ సూర్య దేవాలయం
ఆ ఆలయం యొక్క విశిష్టతను ఒక్కసారి చదవండి.
ఇక్కడున్న ఫోటోలు :
( 1 ) మార్తాండ ఆలయం కూలగొట్టబడక ముందు ఎలా ఉండేది అన్న ఊహా చిత్రం .

( 2 )1868 లో జాన్ బుర్కే అనే బ్రిటీషర్ తీసిన ఫోటో

( 3 ) ప్రస్తుతం మార్తాండ సూర్య దేవాలయం యొక్క ఫోటో
కాశ్మీర్ లోని మార్తాండ సూర్య దేవాలయాన్ని రాజా బుల్నాట్ అనే రాజు నిర్మించారు.

ఆకాలంలో ఆలయం ఎంతో శోభాయమానంగా విరాజిల్లింది.
ఆ విధంగా ఎంతో ప్రశస్తి చెందిన ఆ ఆలయాన్ని సికిందర్ అనే రాజు తన సైనికుల చేత ధ్వంసం చేయించాడు. దాదాపుగా 13 నెలల పాటు సైనికులంతా కలిసి ఎంతో కష్టపడితే, డెబ్బై శాతం ఆలయాన్ని మాత్రమే కూలగొట్టగలిగారు.
అంటే.......ఆ ఆలయాన్ని ఎంత పటిష్టంగా నిర్మించారో మనకు అర్థమవుతోంది. చివరికి.... ఎలాగైనా ఆలయాన్ని పూర్తి నాశనం చేయాలని , మిగిలిన భాగానికి భారీగా నిప్పు పెట్టారు.
అలా......ఆలయాన్ని ధ్వంసం చేసే క్రమంలో
అక్కడి సైనికులకు భూగర్భంలో ఒక రాగి ఫలకం దొరికింది.
ఆ రాగి ఫలకంలో “ రాజా బుల్నట్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ జీవిత కాలం రాజు తెలుసుకోగోరి , ఆస్థాన జ్యోతిష్కులను అడుగగా.........వారు ఈ ఆలయం నిర్మించిన 1100 సంవత్సరాల తర్వాత సికిందర్ అనే పేరు గల రాజు చేతిలో ఇది ధ్వంసం అవుతుంది “ అని రాసి ఉంది.
దీనిని చదివించుకున్న సికిందర్ ఈ ఆలయం ధ్వంసం విషయాన్ని అంత కచ్చితంగా చెప్పిన అప్పటి జ్యోతిష్యుల పరిజ్ఞానానికి , నైపుణ్యానికి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఈ రాగి ఫలకం విషయం తనకు ముందే తెలిసి ఉంటే , ఈ ఒక్క ఆలయాన్ని కూలగొట్టకుండా ఉండి , భారతీయుల యొక్క ఈ శాస్త్రం తప్పని నిరూపించే వాడిని అని సికిందర్ తన సైనికులతో వాపోయాడని చరిత్ర కారులు అంటారు.

🙏🙏😭😭😭🙏🙏

Karma Sidhantam కర్మ సిధ్ధాంతం

కర్మ సిధ్ధాంతం




గురుత్వాకర్షణ సిధ్ధాంతం అనేది ఎక్కడో ఒక ఆపిల్ పండు పడితేనే గానీ లేదా ఎవడో చెప్తేనే గానీ మనకు తెలియలేదు అనే అజ్ఞానపు మూర్ఖత్వం లాగానే
కర్మ సిధ్ధాంతం అనేది నేను నమ్ముతాను నేను నమ్మను నేను నమ్మనిది అసలు ఉండదు ఉండలేదు ఉండబోదు అని ఆలోచించే అజ్ఞాన మూర్ఖత్వానికి పరాకాష్ట

కనబడని ప్రాణవాయువు ద్వారా నీ గుండె గమనం అన్నది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో ప్రాణం పోయాక ఏ ప్రాణ వాయువూ నీ గుండెని ఎలాగ కొట్టుకునేలా చేయలేదో అన్న విషయం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో కర్మ సిధ్ధాంతం పై జరిగే R&D మనము నేర్చుకునే పాటించే ఈ కర్మాచరణ, కర్మ ఫల ప్రాప్తి, నిష్కామకర్మ, కర్మ నివృత్తి, కర్మ శేషమ్, క్రియా యోగం వంటివి అంతే నిజం.

జన్మకి కారణం కర్మ.
జన్మ మరణ చట్రానికి (Loop) కారణం కర్మ.
సుఖదుఖ కర్మాచరణలకు, జీవి యొక్క కర్మఫల భోగభాగ్యాలకు కారణం కర్మ.
కర్మ నిశ్శేషమే మోక్షం.

కర్మ లేదా కర్మ సిధ్ధాంతం అన్నవి అర్ధం చేసుకోవడం ఎంత సులభమో అంతే COMPLEX.
ఈ కర్మ జనితమైన జనన మరణ మాయా నిర్మితమైన పరమాత్మ సృష్టిని దాటడం కూడా ఎంత సులభమో అంతే COMPLEX.
కొన్ని కోట్ల జన్మల సంచిత కర్మ రాశి ఎంత ఉందో ఇంకా ఎన్ని కోట్ల జన్మల ఫలానుభవం మిగిలి ఉందో అర్ధం కావాలంటే ఈ చిన్న Trial చేసిన తెలుస్తుంది.

కళ్ళు మూసుకుని ఆలోచనా రహితంగా ఎలాగ ఉండలేమో ఆయా ఆలోచనలు మన కర్మరాశికి positive మరియూ negative balance add చేస్తూ జీవి అనుభవించాల్సిన కర్మరాశిని పెంచుతూ ఉన్నాయి. అలాంటిది ఇక మన మూర్ఖత్వంతో ప్రతీ రోజూ ప్రతీ క్షణం చేస్తూన్న కర్మ క్రియలను ఎలాగ గణిoచగలము.

భక్తి యోగం క్రియా యోగం జ్ఞాన యోగం కర్మ యోగం వంటి అనేక యోగాలలో ఏ ఒక్క దానిద్వారానైనా పరిపూర్ణత సాధించిన మోక్షప్రాప్తి సంప్రాప్తిస్తుంది.

***             ---              ***                ---               ***

నిష్కామ కర్మ అన్నది ఎంతో జ్ఞానంతో గానీ పరిపక్వతతో గానీ అర్ధం కాదు ఆచరణకి అంతు బట్టదు. చేసే లేదా చేస్తున్న కర్మ ఫలప్రాప్తికి తన చిత్తం అంటకుండా చేసేదే నిష్కామకర్మ. కృష్ణార్పణం అనేది దానికీ ఒక simple solution. చేస్తున్న చేసిన కర్మ  జీవునికి అంటకుండా చేసే ప్రక్రియ. కర్మ మరియూ కర్మ బంధనమే జీవునికి పునర్జన్మ హేతువు.
సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు అని మూడు విధాలు.
సంచిత - ఎన్నో కోట్ల జన్మలలో చేసి పోగు చేసుకున్న కర్మ ఫలితం .
ప్రారబ్ధ - ఈ జన్మలో అనుభవించదగిన కర్మ ఫలితం.
ఆగామి - ఈ జన్మ కర్మ ఫలితం ద్వారా మిగిలే Total Balance Left Out.
NOTE: నిష్కామ, క్రియా యోగ తదితర పద్దతుల ద్వారా Zero out చేసుకోవచ్చు.

మన ఋషులు "ప్రారబ్ద కర్మ" ను మూడు విధాలుగా
విభజించారు  .......

1. ధృతకర్మ 2. ధృతాధృత కర్మ 3. అధృత కర్మ అని.

పూర్వజన్మలో  మన్నించడానికి  ఏ మాత్రం
వీలులేని  ఘోర తప్పిదం చేసినవాళ్ళు  -
"ధృత కర్మ" విభాగంలోకి  వస్తారు  ....
ఒకరిని  హత్యచేయటం, మోసం చేయటం వంటివన్నీ  ఈ భాగంలోనే  వస్తాయి.
వీళ్ళు  ఆ తప్పుకు శిక్షను  అనుభవింల్సిందే ఎంత శాంతి  చేసినా  ఏమి  ఫలితం  ఉండదు,
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ధృతాధృత కర్మ. అనగా క్రిందటి జన్మలో చేసిన తప్పు  క్షమించబడటానికి వీలున్నది, అంటే బొంబాయికి  టిక్కెట్టు కొనుక్కుని ప్రయాణీకుడు పొరపాటున ఢిల్లీ  వెళ్ళే రైలు ఎక్కి, TCకి అది పొరపాటున జరిగినదని  చెప్పటంతో  అతను జరిగిన తప్పు ఒప్పుకొని ప్రయాణీకుడికి జరిమానా వేయకుండా వదిలి వేయటం .......
•••••••••••••••••••••••••••••••••••••••••••••••
ఇక మూడవది అధృత కర్మ.  పూర్వజన్మలో చేసిన చాలా చిన్న పొరపాటు చేసినవ్యక్తికి సంప్రాప్తించేది, మనస్సులోకి ఏదో చిన్న చెడు తలంపు ప్రవేశిస్తుందే కానీ కార్య రూపంలోకి వెళ్ళదు. ఉదాహరణకి మీ ప్రక్కఇంట్లో మీకు నచ్చిన ఒక వస్తువు ఉందనుకోండి. దాన్ని "దొంగిలిస్తే" అనే ఆలోచన మీకు రావచ్చు కానీ మీరు దొంగిలించలేదు. ప్రక్క ఇంటికి  వెళ్లారు ఆ వస్తువు మీద చెయ్యి  కూడా  వేయబోయారు, అంతలో ఎవరో రావటం కనిపెట్టి ఆ క్షణమే తప్పు గ్రహించి చెడు తలంపును ప్రక్కకు నెట్టే వారు. పూర్వజన్మలో మీరు తలబెట్టిన చిన్న తప్పుకి ఈ జన్మలో చిన్న శాంతిచేసి ఆ చెడు తలంపు వల్ల మిమ్మల్ని అంటిన ఆ పాపాన్ని కడుక్కోగల్గుతారు  ........
````````````````````````````````````````````````````
కాబట్టి మొదటి విభాగంలోని వాళ్ళు తప్ప మిగిలిన రెండు విభాగాల్లోని వాళ్ళు శాంతి, గ్రహశాంతి  చేయించటం వాళ్ళకు ఈ జన్మలో మేలు చేస్తుంది అంతే  కాకుండా  రాబోయే  జన్మలో అది బ్యాంక్  బాలెన్స్‌గా మిగులుతుంది కూడా అందుకే జ్యోతిష్కులు శాంతి చేయించండని సలహాలిస్తుంటారు.
..... .........

కర్మ సిధ్ధాంతానికి స్వయానా పరమాత్మ కూడా లోబడి ఉంటాడు దాటలేరు అనే చిన్న ఉదాహరణ మనకోసం.

ఒకసారి శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు అతని స్నేహితులు ఆడుకుంటూ అటుగా వచ్చిన మహర్షులని చూసి ఆటప్పటిద్దాం అనుకున్నారు.

కడుపు వచ్చినట్లు నటించి మహర్షులు రాగానే "అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా" అని అడిగారు. నిజం గ్రహించిన మహర్షులు ఆగ్రహించి మీవంశాన్ని నిర్మూలించే ముసలం పుడుతుంది అని శపించి శ్రీకృష్ణుడిని దర్శించి వెళ్లిపోయారు..

సాంబుడు సహా ఇతర కుమారులంతా వచ్చి శ్రీకృష్ణుడి దగ్గర మొరపెట్టుకుంటే "అది మహర్షుల శాపం. దానికి తిరుగులేదు. నేను తిప్పలేను" మహాత్ములని అవమానించిన ఫలితం అనుభవించండి అని వదిలేశాడు.

కాలక్రమంలో వంశ నాశనం అయింది. మహాభారత యుద్ధం ముగిసింది. యాదవులు అహంకారంతో విర్రవీగుతున్నారు. తనమన బేధాలు మర్చిపోయారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే శ్రీకృష్ణుడి ఎదురుగానే తాగడం, మాంసాహారం తినడం , బూతులు మాట్లాడడం, శ్రీకృష్ణుడిని సైతం అవమానించేలా ప్రవర్తించడం చేశారు. అయన ముందే గొడవలు కొట్లాటలు అబ్బో ఇది అది అనికాదు. సకల దుర్గుణాల నిలయం అయ్యారు. ఒకరోజు యదవులందరూ  అందరూ కలిసి విహారయాత్రకని వెళ్లారు  సముద్రతీరానికి వెళ్లారు. తప్పతాగి మైకంలో ఒకరినొకరు దర్బలతో కొట్టుకొని చచ్చిపోయారు. అలా వంశనిర్మూలనం జరిగిపోయింది.

అనంతరం శ్రీకృష్ణుడు దేహం చాలించాడు. ద్వారకా నగరం కొద్దిసేపట్లో మునిగిపోతుందనగా అర్జునుడు మిగిలిన యాదవ స్త్రీలని శ్రీకృష్ణుడి భార్యల్ని తీసుకొని ఒడ్డుకి చేరుకున్నాడు. ద్వారకనగరం మునిగిపోయింది. ఇంతలో అక్కడికి అతి భయంకరులైన బోయలు కిరతులు వచ్చి కనిపించిన ఆడవాళ్ళని ఎత్తుకుపోయారు. కొందరిని చంపేశారు. శ్రీకృష్ణుడి భార్యల్ని సైతం వదలలేదు. ఎత్తుకుపోయారు. లక్షలాది శత్రువుని అవలీలగా జయించిన అర్జునుడు కిరాతులని ఏమి చేయలేక మిన్నకుండిపోయాడు. కళ్ళముందే ఎత్తుకుపోతుంటే నిష్చేష్టుడై పోయాడు..

కృష్ణుడిని పూజిస్తున్నాం ఆభగవంతుడి దగ్గర తప్పు చేస్తే ఎంతటి వారైనా ఒక్కటే. కట్టుకున్న భార్యల్ని, కన్నకొడుకులని బంధువులనే వదలలేదు.  మహానుభావులతో జాగ్రత్తగా లేకపోతె ఎవడు మిగలడు.  భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటే.. తప్పు చేస్తే ఫలితం అనుభవించాల్సిందే..

Jai Sri Ram..

Friday, 3 March 2017

అశ్విని నక్షత్రము గుణగణాలు

అశ్విని నక్షత్రము గుణగణాలు

అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు. అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధార్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతుతుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.

నవాంశ ఆధారిత గుణాలు

అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యధిపతి కుజుడు కనుక వీరు ధైర్యసైహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనికాధికారులు, అగ్నిమాపకదళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు.అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు

ఈ నక్షత్రం వారి గుణ గణాలు

అశ్వని నక్షత్రము ఏపాదంలో జన్మించినవారైనా అందం పెంపొదించుకోవాలని తాపత్రయపడతారు. ఎంతమందిని సలహాలు అడిగినా తన నిర్ణయాన్ని అమలు చేస్తారు.

అశ్వినీ నక్షత్ర జాతకులకు తారాఫలాలు

తార   నామం.  తారలు.   ఫలం జన్మ తార
అశ్విని, మఖ, మూల.  
 శరీరశ్రమ

సంపత్తార
భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢధనలాభం

విపత్తార
కృత్తిక, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢకార్యహాని

క్షేమత్తార
రోహిణి, హస్త, శ్రవణం
క్షేమం

ప్రత్యక్తార
మృగశిర, చిత్త, ధనిష్ట
ప్రయత్న భంగం

సాధనతార
ఆరుద్ర, స్వాతి, శతభిష
కార్య సిద్ధి, శుభం

నైత్యతార
పునర్వసు, విశాఖ, పూర్వాభాద్రబంధనం

మిత్రతార
పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్రసుఖం

అతిమిత్రతార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
సుఖం, లాభం

అశ్వని నక్షత్రము కొన్ని వివరణలు

నక్షత్రం - అశ్వని
అధిపతి- కేతువు
గణము - దేవ
జాతివృక్షం- పురుష అడ్డరస
జంతువు- గుర్రం
నాడి -ఆది
పక్షి -గరుడ
అధిదేవత- అశ్వని దేవతలు
రాశి -మేషం

అశ్విని కేతువు దేవ పురుషఅడ్డరస గుర్రం ఆది గరుడ అశ్వినీదేవతలు మేషం

అశ్విని నక్షత్రము నవాంశ

1 వ పాదము - మేషరాశి.2 వ పాదము - వృషభరాశి.3 వ పాదము - మిధునరాశి.4 వ పాదము - కర్కాటకరాశి.నక్షత్రానికి ఉన్న గుణలు కలిగిఉన్నా నవాంశని అనుసరించి నాలుగు పాదాల వారికి ప్రత్యేక గుణలు కొన్ని ఉంటాయి.అశ్వినీ నక్షత్రము మొదటి పాదములో పుట్టిన వారు క్రీడాకారులుగా రాణిస్తారు. వీరు వీరవైద్యల అమ్దు ఆసక్తి కలిగి ఉంటారు.అశ్వినీ నక్షత్రము రెండవ పాదములో పుట్టిన వారు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి సంభందించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధవహిస్తారు.అశ్వినీ నక్షత్రము మూడవపాదములో పుట్టిన వారు విద్యలయందు అసక్తి కలిగి ఉంటారు.అశ్విణీ నక్షత్రము నాల్గవ పాదములో పుట్టిన వారు ఆయుర్వేదము వంటి వైద్యము, ఔషధతయారీ వంటి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటారు.

అశ్విని నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలములు

సంఖ్యలు

1, 4, 5, 9

మణి

వైఢూర్యం/రత్నం

వారములు

ఆదివారము, బుధవారము, శుక్రవారము

ఫలములు

ఏకాగ్రత
అశ్వని నక్షత్ర విశేషాలు :

ప్రాథమికంగా అశ్వనీ నక్షత్రం సన్య నక్షత్రంగా పురుష లక్షణంతో క్షిపుతారగా గుర్తింపు పొందింది.  దీనికి అధిపతి కేతువు.
ఈ నక్షత్రంలో జన్మించినవారు పరమేశ్వరార్చన చేసి వైడూర్యాన్ని ధరించవలసి ఉంటుంది.  అశ్వని 4పాదాలూ మేష రాశిలోనే ఉన్నాయి.

అశ్వని మొదటి పాదం

సామాన్య స్థితితో ఆరాటం ఎక్కువగా ప్రదర్శిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. రాజీ ధోరణితో ఉండాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడంవల్ల రకరకాల ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సామాజికంగా గౌరవం పొందాలన్న తపన కనబరుస్తారు.
గ్రహ దశలు
పుట్టిననాటినుంచి కేతు మహర్దశ 7 సం.లు, శుక్ర మహర్దశ 20 సం.లు, రవి మహర్దశ 6 సం.లు, చంద్ర మహర్దశ 10 సం.లు, కుజ మహర్దశ 7 సం.లు అనుభవిస్తారు.
దర్శనీయ క్షేత్రం
తూర్పు గోదావరి జిల్లాలోని బ్రహ్మపురిలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వారిని సందర్శించుకుంటే అస్థిరత ఉపశమించగలదు.

అశ్వని రెండో పాదం

అశ్వని రెండో  పాదంలో జన్మించినవారు పట్టుదలను అధికంగా ప్రదర్శిస్తారు. ఇతరుల భావాన్ని త్వరగా గ్రహించడం వీరు చురుగ్గా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రాజ్ఞులు, దక్షులుగా గుర్తింపు పొందుతారు. సొంత బలం, సొంత ఆలోచనలపై నమ్మకం కలిగిఉంటారు.
గ్రహ దశలు
వీరు పుట్టినప్పటినుంచి కేతు దశ (సుమారుగా) 5సం. 3 నెలలు, శుక్ర మహర్దశ 20 సం, రవి మహర్దశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ మహర్దశ 7 సం.లు అనుభవిస్తారు.
దర్శనీయ క్షేత్రం
తూ.గో.జిల్లాలోని ఉప్పుమిల్లిలో కొలువైన శ్రీబాలా త్రిపురసుందరి సమేత భవానీ శంకర స్వామిని దర్శించుకోవాలి.

అశ్వని మూడో పాదం

వీరికి ప్రాచీన శాస్త్రాలపై ముఖ్యంగా జ్యోతిష, తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో పేరుగాంచుతారు.  అయితే ఆయా సలహాలవల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు. స్వధర్మ నిరతులై ఉంటారు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు.
గ్రహ దశలు
పుట్టినప్పటినుంచి కేతు మహర్దశ (సుమారుగా) మూడున్నర సం.లు, శుక్ర  20 సం, రవి 6 సం, చంద్ర 10 సం, కుజ దశ 7 సం., రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం
కుయ్యేరులోని శ్రీబాలా త్రిపురసుందరి సమేత మల్లేశ్వరస్వామిని అర్చిస్తే శుభం కలుగుతుంది

అశ్వని నాలుగో పాదం

అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. చక్కటి ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. విభిన్నమైన విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్యసాధనలో వెనుకంజ వేయరు. వీరికి ఫలితం సునాయాసంగా అందదు. శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది.
గ్రహ దశలు  
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ (సుమారుగా) 7 సం. 9 నెలలు, శుక్ర  20 సం, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం  
ఈ పాద జాతకులు దుగ్గుదుర్రులోని శ్రీపార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వారిని అర్చించుకోవాలి.

 నక్షత్ర మండలం

జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం మండలాన్ని 12 రాశులుగా విభజించారు. వీటికి 27 నక్షత్రాలను పాదాలవారీగా వర్గీకరించారు. ఆ ప్రకారం ప్రతి నక్షత్రంలోనూ నాలుగు పాదాల్ని గుణించడంద్వారా 27x4=108 పాదాలు అవుతాయి. వీటిని తొమ్మిది చొప్పున సమంగా సర్దినట్టయితే ప్రతి రాశిలోనూ 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. దీని ఆధారంగా పుట్టిన సమయంలో నక్షత్ర సమ యాన్ని 4 భాగాలుగా విభజిస్తారు

జాతక చక్రంలో నక్షత్ర ప్రాధాన్యం

మానవ జీవితం భూమండలంపై ఉండే వివిధ పరిస్థితులతో ముడిపడి ఉంటుంది.  ఈ పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉండవు. ఈ విశ్వాన్ని శాసించే గ్రహాలు, నక్షత్రాల చేతుల్లో ఉంటాయి.  ఆయా గ్రహాల, నక్షత్రాల ప్రీత్యర్థం ఏం చేయాలనే అంశాన్ని కూడా మన పూర్వీకులు జ్యోతిష, ప్రాచీన గ్రంథాలలో సవివరంగా తెలియజేశారు.
రాశి, నక్షత్రం, నక్షత్ర పాదం తెలుసుకొన్నట్లయితే జాతకుడి స్థితిగతులు గ్రహించవచ్చు. అలాగే జాతకుడు తన నక్షత్రాన్ని బట్టి ఆయా నక్షత్ర క్షేత్రాలను దర్శించుకొన వీలుంది. ఈ క్షేత్రాల వివరాలను ప్రాచీన శైవాగమ గ్రంథాలలో పొందుపరిచారు. ఆయా క్షేత్రాలలోని పరమేశ్వరుడిని భక్తితో అర్చిస్తే సంబంధిత నక్షత్రం ఆశీసులు పొందవచ్చును.

క్షేత్ర ప్రదేశాలు

నక్షత్ర క్షేత్రాలన్నీ పావన గోదావరి తీరంలోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం, కోటిపల్లి, రాయవరం మండలాల్లో ఉన్నాయి. వీటిని తమ తమ నక్షత్రానుసారంగా సందర్శించాలి.
శుభకర తిథి వారాలు
రోజులలో సోమవారం, తిథులలో ఏకాదశి, నక్షత్రాలలో ఆర్ద్ర మంచివి. ఆయా రోజులలో, తిథులలో పరమేశ్వరుడిని అర్చించడంవల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.  
 అశ్వని]CAT’S EYE [వైడూర్యము. నామ అక్షరము (చూ.)

2 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము ( చే)

3 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (చో)

4 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (లా)
అను అక్షరములు గల పేర్లు పెట్టవలెను.